Telugu Global
Others

కాల్‌మనీ కింగ్‌లూ... వస్తున్నా మీకోసం..!

సంచలనం సృష్టించిన కాల్‌మనీ-సెక్స్‌ రాకెట్‌లో ప్రభుత్వం, ఒక వర్గం మీడియా తీరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమవుతోంది. సదరు మీడియా రెండురోజులుగా పనిగట్టుకుని వడ్డీవ్యాపారులకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేస్తుండడం ఆశ్చర్యాన్నికలిగిస్తోంది. పైగా సీఎం చంద్రబాబు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పడం ఆలోచించేలా చేస్తోంది. టీడీపీకి అనుకూలమైనదిగా ముద్రపడ్డ సదరు మీడియా సంస్థ చెప్పదలుచుకున్నదేమీటంటే…కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ బయటపడిన తర్వాత జనం చాలా ఇబ్బందులు పడుతున్నారట. సాధారణ వడ్డీ వ్యాపారులు కూడా అప్పు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో జనం […]

కాల్‌మనీ కింగ్‌లూ... వస్తున్నా మీకోసం..!
X

సంచలనం సృష్టించిన కాల్‌మనీ-సెక్స్‌ రాకెట్‌లో ప్రభుత్వం, ఒక వర్గం మీడియా తీరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమవుతోంది. సదరు మీడియా రెండురోజులుగా పనిగట్టుకుని వడ్డీవ్యాపారులకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేస్తుండడం ఆశ్చర్యాన్నికలిగిస్తోంది. పైగా సీఎం చంద్రబాబు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పడం ఆలోచించేలా చేస్తోంది. టీడీపీకి అనుకూలమైనదిగా ముద్రపడ్డ సదరు మీడియా సంస్థ చెప్పదలుచుకున్నదేమీటంటే…కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ బయటపడిన తర్వాత జనం చాలా ఇబ్బందులు పడుతున్నారట. సాధారణ వడ్డీ వ్యాపారులు కూడా అప్పు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో జనం అల్లాడిపోతున్నారట. కాల్‌మనీ వ్యవహారం బయటపడిన తర్వాత అప్పు ఇస్తే తిరిగి చెల్లించరన్న భయం వ్యాపారులను అవరించిందట. అదే మీడియా సంస్థ మరో కీలక విషయాన్ని కూడా ప్రచురించింది.

ఇలా వడ్డీలకు డబ్బు లభ్యం కాక జనం తల్లడిల్లిపోతున్నారని కొందరు టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. వారు చెప్పిన విషయాలు విన్నతర్వాత చంద్రబాబు కూడా ”వామ్మో ఇదేం ట్విస్ట్‌రా బాబు” అంటూ షాక్ అయ్యారంటూ రాసింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి రాష్ట్రంలో సాధారణ వడ్డీ వ్యాపారులు భయపడిపోవడానికి కారణం ఎవరు?. ప్రభుత్వం కాదా?. విజయవాడలో సెక్స్‌ రాకెట్ బయటపడితే దాన్ని పలుచన చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వడ్డీవ్యాపారులపై దాడులు చేయించింది చంద్రబాబు ప్రభుత్వం కాదా?.

విజయవాడ్ కాల్‌మనీపై ఉక్కుపాదం మోపకుండా ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయంటూ జనాన్ని నమ్మించేందుకు పోలీసులతో దాడులు చేయించింది ప్రభుత్వమే. అలాంటప్పుడు ఇప్పుడు వామ్మో జనానికి వడ్డీకి అప్పు దొరకడం లేదా అంటూ చంద్రబాబు ఆశ్చర్యపోతే ఏం లాభం. అయినా బ్యాంకుల్లో, ప్రభుత్వ సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు దొరుకుతుంటే ప్రైవేట్ వడ్డీవ్యాపారుల వెంట జనం ఎందుకు పడుతారు?. పైగా రుణమాఫీ హామీ అమలు కాక రైతులు, డ్వాక్రామహిళలు బ్యాంకుల్లో డిపాల్టర్లుగా మారారు. దీంతో బ్యాంకుల్లో అప్పులు దొరక్క వారు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. లోపం ప్రభుత్వం దగ్గర పెట్టుకుని కాల్‌మనీ, వడ్డీవ్యాపారులకు అనుకూలంగా కథలు చెబితే జనం నమ్మిపోతారని నమ్మకమా?. అయినా రక్తం పీల్చే జలగలు, వడ్డీల మీద బతికే వడ్డీ వ్యాపారులు తమ వృత్తిని మానేశాయంటే ఎవరు నమ్ముతారు? .

Click to Read:

ganta-srinivasa-rao1

2015-secrets1

First Published:  31 Dec 2015 11:23 PM GMT
Next Story