Telugu Global
Others

కటౌట్‌ చినిగింది " పులివెందుల్లో పోరాటం

కడపజిల్లా జమ్మలమడుగు టీడీపీలో రచ్చ రగులుతుండగానే ఇప్పుడు అదే జిల్లాలో మరో ఆధిపత్యపోరాటానికి తెరలేచింది. వైసీపీ నేతలను పార్టీలోకి తెచ్చి జగన్‌ను సొంతజిల్లాలోనే బలహీనపరిచేందుకు అధినాయకత్వం శ్రమిస్తుంటే లోకల్ తమ్ముళ్లు మాత్రం పరస్పర తగువులాటకు దిగుతున్నారు. ఇప్పుడు పట్టుకోసం శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌ మధ్య పోరాటం మొదలైంది. వీరి మధ్య ఆధిపత్యం పోరాటం ఫ్లెక్సీల రూపంలో బయటపడింది. సీఎం రమేష్‌ వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఏకంగా చించిపారేశారు సతీష్‌రెడ్డి వర్గీయులు. […]

కటౌట్‌ చినిగింది  పులివెందుల్లో పోరాటం
X

కడపజిల్లా జమ్మలమడుగు టీడీపీలో రచ్చ రగులుతుండగానే ఇప్పుడు అదే జిల్లాలో మరో ఆధిపత్యపోరాటానికి తెరలేచింది. వైసీపీ నేతలను పార్టీలోకి తెచ్చి జగన్‌ను సొంతజిల్లాలోనే బలహీనపరిచేందుకు అధినాయకత్వం శ్రమిస్తుంటే లోకల్ తమ్ముళ్లు మాత్రం పరస్పర తగువులాటకు దిగుతున్నారు. ఇప్పుడు పట్టుకోసం శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌ మధ్య పోరాటం మొదలైంది. వీరి మధ్య ఆధిపత్యం పోరాటం ఫ్లెక్సీల రూపంలో బయటపడింది. సీఎం రమేష్‌ వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఏకంగా చించిపారేశారు సతీష్‌రెడ్డి వర్గీయులు.

జిల్లాలో సీఎం రమేష్ వర్గీయుడిగా ముద్రపడ్డ రాంగోపాల్‌రెడ్డి వేంపల్లె మొత్తం ఫెక్సీలుపెట్టించారు. చంద్రబాబు, సీఎం రమేష్‌ ఫోటోలను మాత్రమే ఆ ఫెక్సీలపై ముద్రించారు. అదేనియోజకవర్గానికి చెందినప్పటికీ సతీష్ రెడ్డి ఫొటో మాత్రం ముద్రించలేదు. దీంతో సతీష్ రెడ్డి బ్యాచ్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన నియోజకవర్గంలో తన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు పెట్టడంపై సతీష్‌ రెడ్డి ఆగ్రహించినట్టు సమాచారం. ఆయన అనుచరులు వేంపల్లెలోని సెంటర్లలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చించిపారేశారు. సతీష్‌ రెడ్డి వర్గీయుల ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు సీఎం రమేష్‌ వర్గీయులు వచ్చారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే ఈ గొడవకు అసలు కారణం ఫ్లెక్సీలపై ఫోటోలు కాదని… మూలం వేరే ఉందని చెబుతున్నారు.

వరుసగా ఓడిపోతున్నా పులివెందుల నియోజక‌వర్గంలో టీడీపీకి చాలాకాలంగా సతీష్‌ రెడ్డి అండగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల సీఎం రమేష్‌ వర్గీయులు తమ ప్రాధాన్యతను తగ్గించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సతీష్ రెడ్డి వర్గం అనుమానం. సీఎం రమేష్ వర్గీయుల పనితీరు కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఏకంగా వేంపల్లిలో సతీష్ రెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు పెట్టడంతో ఆయన వర్గం అప్రమత్తమైంది. ఇలాగే చూస్తూ కూర్చుంటే కొద్దిరోజులకు పులివెందుల రాజకీయాల నుంచి తమను వెళ్లగొడుతారని డిసైడ్ అయ్యారు. అందుకే సతీష్ రెడ్డి వర్గం ప్రతిఘటన మొదలుపెట్టినట్టు భావిస్తున్నారు.

Click to Read:

adinarayana-reddy1

akhila-priya-cbn

First Published:  1 Jan 2016 9:00 PM GMT
Next Story