మండింది – విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకో ఆది…

జమ్మలమడుగు రాజకీయం సాగుతూనే ఉంది. ఒక కొలిక్కిమాత్రం రావడం లేదు. ఇలా అయితే పని జరగదనుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రెండు రోజుల క్రితం ఓపెన్ అయ్యారు. టీడీపీలో చేరేందుకు తాను సిద్ధమని … ఎప్పుడు రావాలన్నది చంద్రబాబే నిర్ణయించాలని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు.

టీడీపీలోకి వస్తానంటున్న ఆదినారాయణరెడ్డి తీరు విడాకులివ్వకుండానే మరో పెళ్లికి సిద్ధపడినట్టుగా ఉందన్నారు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని సవాల్‌ చేశారు. కేశవరెడ్డి స్కూళ్ల డిపాజిట్‌ వ్యవహారంలో రూ. 800 కోట్ల కుంభకోణం జరిగిందని.. వియంకుడు కేశవరెడ్డిని రక్షించుకునేందుకే ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వస్తున్నారని రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. అసలు టీడీపీలోకి ఎందుకు వస్తున్నారో ఆదినారాయణరెడ్డి చెప్పాలన్నారు. మరోవైపు ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వస్తే రామసుబ్బారెడ్డి పార్టీ వీడుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల రామసుబ్బారెడ్డి దగ్గరి బంధువులు జగన్‌ కలిసి దీనిపై చర్చలు కూడా జరిపారు.

Click to Read:

pawan-kalyan-political

ap-IAS