Telugu Global
Others

అష్టదిగ్బంధనానికి కొత్త ప్రయోగం

తెలంగాణలో కేసీఆర్‌ దెబ్బకు అన్ని గొంతులు మెత్తబడినా రేవంత్‌ రెడ్డి మాత్రం తగ్గడం లేదు. ఎంతపడితే అంత మాటా అనేయడం… పదేపదే సవాళ్లు విసరడం రేవంత్‌కి పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో రేవంత్‌ మూలాలను దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ వ్యూహం రచించింది. కొడంగల్‌లో తన గెలుపుకు డోకా ఉండదన్న ధీమాతోనే రేవంత్ … సొంతనియోజవర్గం వ్యవహారాలను కుటుంబసభ్యులకు వదిలేసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. నిత్యం కేసీఆర్‌ను తిట్టిపోస్తున్నారు. దీంతో రేవంత్‌ను సొంతనియోజకవర్గంలోనే బలహీనపరిచేందుకు టీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. […]

అష్టదిగ్బంధనానికి కొత్త ప్రయోగం
X

తెలంగాణలో కేసీఆర్‌ దెబ్బకు అన్ని గొంతులు మెత్తబడినా రేవంత్‌ రెడ్డి మాత్రం తగ్గడం లేదు. ఎంతపడితే అంత మాటా అనేయడం… పదేపదే సవాళ్లు విసరడం రేవంత్‌కి పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో రేవంత్‌ మూలాలను దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ వ్యూహం రచించింది. కొడంగల్‌లో తన గెలుపుకు డోకా ఉండదన్న ధీమాతోనే రేవంత్ … సొంతనియోజవర్గం వ్యవహారాలను కుటుంబసభ్యులకు వదిలేసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. నిత్యం కేసీఆర్‌ను తిట్టిపోస్తున్నారు. దీంతో రేవంత్‌ను సొంతనియోజకవర్గంలోనే బలహీనపరిచేందుకు టీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన మినిస్టర్ మహేందర్‌ రెడ్డి సోదరుడు నరేందర్‌ రెడ్డిని కొడంగల్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించబోతున్నారు. ఇక్కడ మరో కీలక అంశం ఏమిటంటే ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి ఏదో ఒక నియోజకవర్గాన్నిఎంపిక చేసుకోవచ్చు. అప్పుడు సదరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో సమానంగా ఎమ్మెల్సీకి ప్రోటోకాల్ వర్తిస్తుంది. ఈ పాయింట్‌ను వాడుకుని కొడంగల్‌లోని నిధులను ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఖర్చు పెట్టించాలని అధికార పార్టీ నిర్ణయించుకుంది. అంటే ఏ పని జరగాలన్న జనం రేవంత్ రెడ్డి దగ్గరకు కాకుండా ఎమ్మెల్సీ నరేందర్‌ రెడ్డి వద్దకు వెళ్లేలా చేయాలన్నది అధికారపార్టీ వ్యూహం. రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్తే పని జరగదు అన్న అభిప్రాయం జనంలో కలిగించాలన్నది ఎత్తుగడ.

రేవంత్ రెడ్డిని దెబ్బతీసేందుకు నరేందర్‌రెడ్డి చేతుల మీదుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడకూడదన్న ఆలోచనలో అధికార పార్టీ ఉందని చెబుతున్నారు. వీలైతే నెలకు 20రోజులు కొడంగల్ లో ఉండేలా నరేందర్ రెడ్డికి దిశానిర్దేశం చేస్తారట. దీనికి తోడు మంత్రి మహేందర్ రెడ్డికి కొండంగల్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో బంధువర్గం కూడా ఉండడం కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను వదిలేసి సొంతిల్లు చక్కబెట్టుకునేందుకు కొడంగల్ వెళ్లిపోవాల్సిన పరిస్థితిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద 2019 ఎన్నికల్లో కొడంగల్ లో గులాబీ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ వ్యూహం రచించినట్టు తెలుస్తోంది.

First Published:  3 Jan 2016 5:01 AM GMT
Next Story