Telugu Global
NEWS

తెరకెక్కనున్న "వంగవీటి" వార్‌

వివాదాల వర్మ ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. రక్తచరిత్ర సినిమా తీసి పరిటాల రవి, మద్దెలచెర్వు సూరి మధ్య ఫ్యాక్షన్‌ వివాదాన్ని చూపించిన వర్మ ఇప్పుడు బెజవాడ కథపై గురిపెట్టారు. ఇప్పటికే ”బెజవాడ” పేరుతో సినిమా తీసిన వర్మ ఇప్పుడు వంగవీటి రంగా హత్య, అప్పటి పరిణామాలను తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని వర్మ స్వయంగా తన ట్వీట్టర్‌లో ప్రకటించారు. చిత్రం పేరు కూడా ”వంగవీటి” అని ట్వీట్ చేశారు. వంగవీటి రాధా మొదలు వంగవీటి […]

తెరకెక్కనున్న వంగవీటి వార్‌
X

వివాదాల వర్మ ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. రక్తచరిత్ర సినిమా తీసి పరిటాల రవి, మద్దెలచెర్వు సూరి మధ్య ఫ్యాక్షన్‌ వివాదాన్ని చూపించిన వర్మ ఇప్పుడు బెజవాడ కథపై గురిపెట్టారు. ఇప్పటికే ”బెజవాడ” పేరుతో సినిమా తీసిన వర్మ ఇప్పుడు వంగవీటి రంగా హత్య, అప్పటి పరిణామాలను తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని వర్మ స్వయంగా తన ట్వీట్టర్‌లో ప్రకటించారు. చిత్రం పేరు కూడా ”వంగవీటి” అని ట్వీట్ చేశారు.

వంగవీటి రాధా మొదలు వంగవీటి రంగా హత్య వరకు సాగిన ఉదంతాలు ఈ చిత్రంలో ఉంటాయని వర్మ చెప్పారు. అయితే రంగా హత్య, ఆ అనంతరం విజయవాడలో జరిగిన ఘటనలను జరిగినవి జరిగినట్టుగా చూపే ప్రయత్నం చేస్తే వర్మకు వార్నింగ్‌లు రాకుండా ఉంటాయా అన్నది చూడాలి. వర్మ చూపు హఠాత్తుగా వంగవీటి రంగా స్టోరిపై పడడానికి కారణం ఏమిటన్నది ఆసక్తికరమే. బహుషా మాజీ మంత్రి హరిరామజోగయ్య ఇటీవల తన పుసక్తంలో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్‌తోనే రంగా హత్య జరిగిందని వివరించారు. దాంతో రంగా హత్యపై మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ టైమింగ్‌ చూసుకునే వర్మ సినిమా తీసేందుకు సిద్ధమైనట్టు భావిస్తున్నారు.

https://twitter.com/RGVzoomin/status/683272642825043970

First Published:  3 Jan 2016 4:02 AM GMT
Next Story