Telugu Global
Others

బోస్ మరణం " బ్రిటన్ వెబ్ సైట్ లో కొత్త విషయాలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీపై మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బ్రిటన్ కు చెందిన ఓ వెబ్ సైట్ సుభాష్ చంద్రబోస్ కు చెందిన కొత్త ఫైళ్లను విడుదల చేసింది. బోస్ మరణానికి ముందు ఆఖరి రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తున్న బ్రిటన్‌కు చెందిన WWW.BOSEFILES.INFO అనే వెబ్‌సైట్‌ కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. సుభాస్ చంద్రబోస్ ఆగస్టు 18, 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో […]

బోస్ మరణం  బ్రిటన్ వెబ్ సైట్ లో కొత్త విషయాలు
X
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీపై మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బ్రిటన్ కు చెందిన ఓ వెబ్ సైట్ సుభాష్ చంద్రబోస్ కు చెందిన కొత్త ఫైళ్లను విడుదల చేసింది. బోస్ మరణానికి ముందు ఆఖరి రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తున్న బ్రిటన్‌కు చెందిన WWW.BOSEFILES.INFO అనే వెబ్‌సైట్‌ కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. సుభాస్ చంద్రబోస్ ఆగస్టు 18, 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడని అధికారికంగా ప్రకటించారు. అయితే బోస్ 1964లో జవహర్ లాల్ నెహ్రూ అంత్యక్రియల్లో పాల్గొన్నారంటూ కొన్ని డాక్యుమెంటరీలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బ్రిటన్ వెబ్ సైట్ విడుదల చేసిన టెలిగ్రామ్ ఇవన్నీ తప్పుడు ప్రచారమని కొట్టిపారేస్తోంది. బోస్ చనిపోయారని చెప్తున్న విమాన ప్రమాదం తర్వాత కొన్నేళ్లకు ఆయన చైనాలో కనిపించారన్న వాదనలను తిరస్కరించేలా ఈ వెబ్ సైట్ విడుదల చేసిన ఫైళ్లలోని అంశాలు ఉన్నాయి. 1952లో బోస్ చైనాలో కనిపించారన్న వార్తలను ఖండిస్తూ బీజింగ్‌లోని భారతీయ ఎంబసీ పంపిన ఒక టెలిగ్రామ్‌ను ఈ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు చనిపోయారని భావించారు. అయితే 1952లో ఎస్‌ఎం గోస్వామి అనే బోసు అభిమాని నేతాజీ మిస్టరీ వీడింది అనే శీర్షికతో ఒక కరపత్రం వెలువరించారు. అందులో మంగోలియన్ వాణిజ్య ప్రతినిధి బృందం చైనా అధికారులతో ఉన్న ఒక ఫొటోను ముద్రించారు. అందులో ఉన్న ఒక వ్యక్తి సుభాస్ చంద్రబోస్ అని తెలిపారు. నేతాజీ అదృశ్యంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ముందు గోస్వామి హాజరయ్యారు.
కరపత్రంలోని ఫొటోను చూపిస్తూ ఆయన బతికే ఉన్నారని అప్పట్లో గోస్వామి వాదించారు. దాంతో గోస్వామి వాదనను ధ్రువీకరించుకునేందుకు ఆ ఫొటోను అప్పట్లో బీజింగ్‌లోని భారతీయ ఎంబసీకి పంపారు. దాన్ని పరిశీలించిన ఎంబసీ అధికారులు ఆ ఫొటోలో ఉన్నది బోస్ కాదని నిర్ధారించారు. అంతేకాదు.. ఫొటోలో బోస్ అని చెప్తున్న వ్యక్తి ది పెకింగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీకి చెందిన మెడికల్ సూపరింటెండెంట్ లీ కే హుంగ్ అని చైనా ఎంబసీ అధికారులు తెలిపారు. బోస్ చైనాలో కనిపించారన్న వాదనలను తప్పు పట్టేవాటిలో ఈ టెలిగ్రామ్ ఒకటని వెబ్‌సైట్ ఏర్పాటు చేసిన లండన్‌కు చెందిన జర్నలిస్టు అశిష్ రే అన్నారు. బోస్ కు సంబంధించిన మరిన్ని ఫైళ్లను జనవరి తొమ్మిదిన విడుదల చేస్తామని ఈ వెబ్ సైట్ లో తెలిపింది.
First Published:  2 Jan 2016 1:01 PM GMT
Next Story