Telugu Global
Others

వలస పోరు- బాబు టూర్‌కు ఇద్దరు ఎమ్మెల్యేల డుమ్మా!

విశాఖ జిల్లాలో కొణతాల రామకృష్ణని టీడీపీలోకి ఆహ్వానిస్తుండడాన్ని జిల్లా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొణతాలను తీసుకోవడం ఖాయమని అధినాయకత్వం స్పష్టం చేసినప్పటికీ తమ్ముళ్లు మాత్రం ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతూనే ఉన్నారు. తాజాగా విశాఖ ఉత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరవగా ఆ కార్యక్రమానికి విశాఖ జిల్లాకు చెందిన పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గనబాబు డుమ్మాకొట్టారట. ఇప్పుడు జిల్లా టీడీపీలో ఇదే చర్చనీయాంశమైంది. అధినాయకత్వంపై తిరుగుబాటు చేసేంత ఆలోచన వీరికి లేకపోయినా కొణతాలను […]

వలస పోరు- బాబు టూర్‌కు ఇద్దరు ఎమ్మెల్యేల డుమ్మా!
X

విశాఖ జిల్లాలో కొణతాల రామకృష్ణని టీడీపీలోకి ఆహ్వానిస్తుండడాన్ని జిల్లా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొణతాలను తీసుకోవడం ఖాయమని అధినాయకత్వం స్పష్టం చేసినప్పటికీ తమ్ముళ్లు మాత్రం ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతూనే ఉన్నారు. తాజాగా విశాఖ ఉత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరవగా ఆ కార్యక్రమానికి విశాఖ జిల్లాకు చెందిన పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గనబాబు డుమ్మాకొట్టారట. ఇప్పుడు జిల్లా టీడీపీలో ఇదే చర్చనీయాంశమైంది.

అధినాయకత్వంపై తిరుగుబాటు చేసేంత ఆలోచన వీరికి లేకపోయినా కొణతాలను పార్టీలోకి తీసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. అందుకే ఇలా బాబు పర్యటనకు డుమ్మా కొట్టి నిరసన తెలిపారని అంటున్నారు. ఈ వ్యవహారంపై బండారు సత్యానారాయణ స్పందించారు. తాను చంద్రబాబు పర్యటనకు డుమ్మా కొట్టలేదని జన్మభూమి కార్యక్రమం ఉంటే వెళ్లానని చెబుతున్నారు. అయితే కొణతాల రాకపై కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్నారు.

ఒకవేళ కొణతాల పార్టీలోకి వచ్చినా పార్టీకి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. చంద్రబాబుకు సలహాలు ఇస్తా, డైరెక్షన్ చేస్తా వంటి గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలన్నారు. కొణతాలతో కలిసి పనిచేసేందుకు మీకు అభ్యంతరం లేదా అని ప్రశ్నించగా” మేము వాళ్లతో కలిసి పనిచేయడం కాదు.. వారే మాతో కలిసి పనిచేయాలి. వాళ్లు ఓడిపోయిన వారు.. వాళ్లతో మేం కలిసి పనిచేయడం కాదు. వారే మాతో ఉండి, పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి” అని బండారుసత్యనారాయణ అన్నారు. దీని బట్టి చూస్తుంటే కొణతాల టీడీపీలో చేరినా తమ్ముళ్ల పోరు తప్పదనిపిస్తోంది.

Click to Read:

thermal-power-plant

srikalahasti

First Published:  4 Jan 2016 4:15 AM GMT
Next Story