Telugu Global
Others

పద్మభూషణ్‌ కోసం నన్ను కాకాపట్టారు

కేంద్ర మంత్రి గడ్కరీ కీలక విషయాన్ని బయటపెట్టారు. బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ పద్మభూషణ్ పురస్కారం కోసం లాబీయింగ్ చేశారని చెప్పారు. అది కూడా తన దగ్గరకే వచ్చి లాబీయింగ్ చేశారని వెల్లడించారు. ఇటీవల పలువురు ప్రముఖులు అవార్డుల కోసం తన చుట్టూ తిరుగుతున్నారని చెబుతూ ఆశా పరేఖ్ విషయాన్ని బయటపెట్టారు. ఆశా పరేఖ్ నేరుగా తన ఇంటికే వచ్చారని గడ్కరీ చెప్పారు. తానుంటున్న అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ పనిచేయకపోవడంతో ఏకంగా 12 అంతస్తులు మెట్లు ఎక్కి వచ్చి కలిశారన్నారు. […]

పద్మభూషణ్‌ కోసం నన్ను కాకాపట్టారు
X

కేంద్ర మంత్రి గడ్కరీ కీలక విషయాన్ని బయటపెట్టారు. బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ పద్మభూషణ్ పురస్కారం కోసం లాబీయింగ్ చేశారని చెప్పారు. అది కూడా తన దగ్గరకే వచ్చి లాబీయింగ్ చేశారని వెల్లడించారు. ఇటీవల పలువురు ప్రముఖులు అవార్డుల కోసం తన చుట్టూ తిరుగుతున్నారని చెబుతూ ఆశా పరేఖ్ విషయాన్ని బయటపెట్టారు.

ఆశా పరేఖ్ నేరుగా తన ఇంటికే వచ్చారని గడ్కరీ చెప్పారు. తానుంటున్న అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ పనిచేయకపోవడంతో ఏకంగా 12 అంతస్తులు మెట్లు ఎక్కి వచ్చి కలిశారన్నారు. ఆశా పరేఖ్‌ అలా లాబీయింగ్‌కు దిగడం తనకు నచ్చలేదని చెప్పారు. గడ్కరీ నాగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయం చెప్పారు.

First Published:  3 Jan 2016 8:00 PM GMT
Next Story