Telugu Global
Cinema & Entertainment

ఆ న్యూస్ ఛానెల్ పై రామ్ గుస్సా

నేను శైలజ సినిమా విషయంలో రామ్  హ్యాపీగా లేడు. ఒక్క న్యూస్ ఛానెల్…. ఒకే ఒక్క న్యూస్ ఛానెల్…. రామ్ కు కోపం తెప్పించింది. వెంటనే తన మొబైల్ అందుకున్నాడు. ట్విట్టర్ ఆన్ చేశాడు. సదరు న్యూస్ ఛానెల్ పై వరుసగా ట్వీట్స్ చేసుకుంటూ పోయాడు.  1. ప్రొడ్యూసర్ పై కోపం ఉంటే… సినిమాపై తప్పు రివ్యూ ఇవ్వడం… పొలిటీషియన్ పై కోపం ఉంటే అతడిపై తప్పు న్యూస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. 2. వార్తా ఛానెల్ […]

ఆ న్యూస్ ఛానెల్ పై రామ్ గుస్సా
X
నేను శైలజ సినిమా విషయంలో రామ్ హ్యాపీగా లేడు. ఒక్క న్యూస్ ఛానెల్…. ఒకే ఒక్క న్యూస్ ఛానెల్…. రామ్ కు కోపం తెప్పించింది. వెంటనే తన మొబైల్ అందుకున్నాడు. ట్విట్టర్ ఆన్ చేశాడు. సదరు న్యూస్ ఛానెల్ పై వరుసగా ట్వీట్స్ చేసుకుంటూ పోయాడు.
1. ప్రొడ్యూసర్ పై కోపం ఉంటే… సినిమాపై తప్పు రివ్యూ ఇవ్వడం… పొలిటీషియన్ పై కోపం ఉంటే అతడిపై తప్పు న్యూస్ ఇవ్వడం కరెక్ట్ కాదు.
2. వార్తా ఛానెల్ నడపడం అతిపెద్ద బాధ్యత. వివక్ష లేకుండా వార్తలిస్తారని నేను, ప్రజలు నమ్ముతున్నాం. అది సినిమా అయినా రాజకీయం అయినా ఒకటే.
3. ఆ ఛానెల్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. సదరు ఛానెల్ తన స్థాయిని నిలబెట్టుకుంటుందనే ఆశిస్తున్నా.
4. ఆ ఒక్క ఛానెల్ లో తప్ప…. ప్రపంచవ్యాప్తంగా నేను శైలజ సినిమా బాగా నడుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.
ఇలా నేను శైలజ సినిమాకు సంబంధించి ఆదివారమంతా ఆ ఛానెల్ పై దుమ్మెత్తిపోశాడు రామ్.
First Published:  3 Jan 2016 7:02 PM GMT
Next Story