Telugu Global
Others

రోజా జీవితంపై సినిమా- ప్రముఖ పత్రిక కథనం

వివిధ రంగాల్లో సంచలనాలకు వేదికైన మహిళలపై సినిమాలు తీయడం ఇటీవల జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రోజా చేరబోతున్నట్టు సమాచారం. రోజా వెండితెర ప్రవేశం, అక్కడ ఎదుర్కొన్న ఆటుపోట్లు, అనంతరం రాజకీయ రంగ ప్రవేశం, అందులో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకోవడం వంటి అంశాల ఆధారంగా సినిమా తీస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తన తొలి తమిళ సినిమా దర్శకుడు ఆర్‌కే. సెల్వమణితో ప్రేమ వివాహం వంటి అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయంటున్నారు. త్వరలోనే రోజా జీవితం వెండితెరపై […]

రోజా జీవితంపై సినిమా- ప్రముఖ పత్రిక కథనం
X

వివిధ రంగాల్లో సంచలనాలకు వేదికైన మహిళలపై సినిమాలు తీయడం ఇటీవల జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రోజా చేరబోతున్నట్టు సమాచారం. రోజా వెండితెర ప్రవేశం, అక్కడ ఎదుర్కొన్న ఆటుపోట్లు, అనంతరం రాజకీయ రంగ ప్రవేశం, అందులో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకోవడం వంటి అంశాల ఆధారంగా సినిమా తీస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తన తొలి తమిళ సినిమా దర్శకుడు ఆర్‌కే. సెల్వమణితో ప్రేమ వివాహం వంటి అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయంటున్నారు. త్వరలోనే రోజా జీవితం వెండితెరపై కనిపించనుందని కోలీవుడ్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ దిన పత్రిక కూడా ప్రచురించింది.

First Published:  3 Jan 2016 9:30 PM GMT
Next Story