Telugu Global
Others

ఏపీ విద్యుత్ ప్లాంట్లలో రూ. 2, 872 కోట్ల కుంభకోణమా?

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించతలపెట్టిన రెండు భారీ థర్మల్ ప్లాంట్‌ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నోయిడాకు చెందిన ఒక స్వచ్చంద సంస్థ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. సదరు స్వచ్చంద సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు ఈ లేఖ రాశారు. టెండర్ నిబంధనలను కేవలం కొన్ని కంపెనీలకు అనుకూలంగా ఏపీ జెన్‌కో తయారు చేసిందని ఆరోపణ. అలా చేయడం వల్ల చివరకు రెండు కంపెనీలు మాత్రమే అర్హత సాధించి… వాస్తవ ధర కంటే ఎక్కువగా టెండర్ […]

ఏపీ విద్యుత్ ప్లాంట్లలో రూ. 2, 872 కోట్ల కుంభకోణమా?
X

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించతలపెట్టిన రెండు భారీ థర్మల్ ప్లాంట్‌ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నోయిడాకు చెందిన ఒక స్వచ్చంద సంస్థ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. సదరు స్వచ్చంద సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు ఈ లేఖ రాశారు. టెండర్ నిబంధనలను కేవలం కొన్ని కంపెనీలకు అనుకూలంగా ఏపీ జెన్‌కో తయారు చేసిందని ఆరోపణ. అలా చేయడం వల్ల చివరకు రెండు కంపెనీలు మాత్రమే అర్హత సాధించి… వాస్తవ ధర కంటే ఎక్కువగా టెండర్ కోట్‌ చేశారని ఆరోపించింది. 800 మెగావాట్ల సామర్థ్యంతో ప్రతిపాదిత కృష్ణపట్నం, విజయవాడలో థర్మల్ ప్లాంట్‌లో ఈ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఒకమెగావాట్ ఉత్పత్తికి గుజరాత్, మహారాష్ట్ర్రలో రూ. 4.76 కోట్ల నుంచి రూ. 3.94కోట్ల మధ్య ఖర్చు అవుతోందని సదరు సంస్థ లెక్కలు కూడా పంపింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో టెండర్ల గోల్‌మాల్ వల్ల కృష్ణపట్నం ప్లాంట్‌లో మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి ధర ఏకంగా రూ. 6.3 కోట్లకు చేర్చారని స్వచ్చంధ సంస్థ చెబుతోంది. విజయవాడ ప్లాంట్‌లో ఉత్పత్తి ధరను రూ. 5. 85 కోట్లకు పెంచారని ఆరోపించింది. దీని వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 2, 872 కోట్ల నష్టం వాటిల్లిందని సంస్థ లెక్కలు వేసి చూపుతోంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబును కోరింది ఆ సంస్థ. అయితే ఈ ఆరోపణలను జెన్‌కో అధికారులు తోసిపుచ్చుతున్నారు. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని చెబుతున్నారు. అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లవచ్చంటున్నారు.

First Published:  4 Jan 2016 3:17 AM GMT
Next Story