Telugu Global
Others

సాయం అడగలేరు... ఢిల్లీ ఫ్లైట్ ఎక్క లేరు! ఎందుకంటే?

అధికారం చేపట్టిన తొలినాళ్లలో పదేపదే ప్రైవేట్‌ విమానమేసుకుని హస్తినకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు అలా చేయడం లేదు. అసలు ఢిల్లీ అంటే విముఖంగా ఉన్నారు. ఢిల్లీ వెళ్ల వద్దు… కేంద్ర సాయమూ వద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఇంతలా విరక్తి కలగడానికి కారణం కేంద్రం నిధులు ఇవ్వకపోవడం కాదు. ఇచ్చిన డబ్బుకు చంద్రబాబు లెక్కలు చెప్పకపోవడం. హుద్‌హుద్‌ తుపాను సమయంలో, అమరావతి నిర్మాణం కోసం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు […]

సాయం అడగలేరు... ఢిల్లీ ఫ్లైట్ ఎక్క లేరు! ఎందుకంటే?
X

అధికారం చేపట్టిన తొలినాళ్లలో పదేపదే ప్రైవేట్‌ విమానమేసుకుని హస్తినకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు అలా చేయడం లేదు. అసలు ఢిల్లీ అంటే విముఖంగా ఉన్నారు. ఢిల్లీ వెళ్ల వద్దు… కేంద్ర సాయమూ వద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఇంతలా విరక్తి కలగడానికి కారణం కేంద్రం నిధులు ఇవ్వకపోవడం కాదు. ఇచ్చిన డబ్బుకు చంద్రబాబు లెక్కలు చెప్పకపోవడం. హుద్‌హుద్‌ తుపాను సమయంలో, అమరావతి నిర్మాణం కోసం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ నిధులను అసలు పనికి కాకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. వెనుకబడిన జిల్లాల కోసం ఇచ్చిన నిధులను ప్రభుత్వం వేరే అవసరాలకు ఖర్చుపెట్టింది. ఇలా కేంద్రం ఇచ్చిన తొలివిడత సొమ్ము ఖర్చయిపోయాక మరోసారి రాజధాని నిర్మాణానికి సాయం కావాలంటూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను పంపింది. అక్కడే అసలు విషయం బయటపడింది.

రాజధాని కోసం తొలి విడత తాము ఇచ్చిన సుమారు 1500కోట్ల రూపాయలు ఏం చేశారో లెక్క చెప్పండి …అప్పుడు రెండో విడత సొమ్ము విడుదల చేస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. అంతేందుకు ఇటీవల నెల్లూరు జిల్లాను వరదలు ముంచెత్తితే వెయ్యి కోట్ల సాయం కావాలని చంద్రబాబు అడిగారు. కానీ కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సహాయంకోసం విజ్ఞప్తి చెయ్యగానే 24 గంటలలోపుగా తమిళనాడుకు కేంద్రం 932కోట్ల రూపాయల సహాయం అందించింది. మనకు మాత్రం మొండిచెయ్యిచూపించింది.

దీనికి కారణం హుద్‌హుద్‌ సమయంలో కేంద్రం ఇచ్చిన సొమ్మును ఎలా ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పకపోవడమే. దీంతో కేంద్రం నుంచి ప్రకృతి విపత్తుల సమయంలోనైనా, రాజధాని కోసమైనా రెండో విడత సాయం పొందలేని పరిస్థితి. భవిష్యత్తులో రాష్ట్రంలో విపత్తులు వచ్చినా కేంద్రం సాయం చేయకపోవచ్చని చెబుతున్నారు. గత విపత్తుల సమయంలో ఖర్చుల వివరాలు తెలిపితేనే భవిష్యత్తులో ఏ సాయమైనా అందుతుందని చెబుతున్నారు. దీని వల్లే ఇటీవల ఢిల్లీ వెళ్లడం చంద్రబాబు తగ్గించివేశారని చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లి సాయం అడితే ముందు పాత లెక్కలు చెప్పండి అని కేంద్రం అడుగుతుంది. కానీ ఆ సొమ్మును ఉద్దేశించిన కార్యక్రమాలకు కాకుండా ఇతర పనులకు వాడేశారు. అందుకే హస్తినకు చంద్రబాబు ముఖం చాటేస్తున్నారని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లినా అరుణ్ జైట్లీ కూతురి రిసెప్షన్ కోసమే వెళ్లారు.

First Published:  3 Jan 2016 8:01 PM GMT
Next Story