అచ్చెన్న ఇంటి ముందు డప్పు నిరసన

శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు ఇంటి ముందు డప్పు కళాకారులు వినూత్నంగా నిరసన తెలిపారు. చలో మంత్రి కార్యాలయం పేరుతో ర్యాలీగా మంత్రి ఇంటివద్దకు వెళ్లి డప్పు వాయించారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, పించన్లు, గౌరవవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కార్యక్రయంలోని ప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.