Telugu Global
Others

మంత్రులకు కొమ్ములొచ్చాయి... బుగ్గ కార్లకు బాబు వార్నింగ్

ఏపీ మంత్రుల పనితీరుపై చంద్రబాబుకు దారుణమైన రిపోర్టులు అందుతున్నాయి. ఇంటెలిజెన్స్‌తో పాటు వివిధ మార్గాల్లో తెప్పించుకున్న నివేదికలు చూపిన తర్వాత చంద్రబాబుకు మంత్రులపై చిర్రెత్తుకొచ్చేలా  చేసిందని  చెబుతున్నారు. ఇలా అయితే పనికాదనుకున్న చంద్రబాబు కొద్ది రోజుల క్రితం విజయవాడలో జిల్లా టీడీపీ అధ్యక్షులు, మంత్రులను ఒకే చాంబర్‌లో కూర్చొబెట్టి క్లాస్‌ పీకారు.  కొందరు మంత్రులకు కొమ్ములొచ్చాయి అన్నడైలాగ్‌తో మొదలుపెట్టి దాదాపు మూడు గంటల పాటు మంత్రులను విడతల వారీగా ఆడుకున్నారట. పైగా సమావేశంలోనే మంత్రుల  తీరును జిల్లా అధ్యక్షులతో చెప్పించి మినిస్టర్లకు దిమ్మతిరిగేలా చేశారు. జిల్లాలకు […]

మంత్రులకు కొమ్ములొచ్చాయి... బుగ్గ కార్లకు బాబు వార్నింగ్
X

ఏపీ మంత్రుల పనితీరుపై చంద్రబాబుకు దారుణమైన రిపోర్టులు అందుతున్నాయి. ఇంటెలిజెన్స్‌తో పాటు వివిధ మార్గాల్లో తెప్పించుకున్న నివేదికలు చూపిన తర్వాత చంద్రబాబుకు మంత్రులపై చిర్రెత్తుకొచ్చేలా చేసిందని చెబుతున్నారు. ఇలా అయితే పనికాదనుకున్న చంద్రబాబు కొద్ది రోజుల క్రితం విజయవాడలో జిల్లా టీడీపీ అధ్యక్షులు, మంత్రులను ఒకే చాంబర్‌లో కూర్చొబెట్టి క్లాస్‌ పీకారు. కొందరు మంత్రులకు కొమ్ములొచ్చాయి అన్నడైలాగ్‌తో మొదలుపెట్టి దాదాపు మూడు గంటల పాటు మంత్రులను విడతల వారీగా ఆడుకున్నారట. పైగా సమావేశంలోనే మంత్రుల తీరును జిల్లా అధ్యక్షులతో చెప్పించి మినిస్టర్లకు దిమ్మతిరిగేలా చేశారు. జిల్లాలకు వస్తే మంత్రులు పార్టీ కార్యాలయాలకు కూడా రావడం లేదని కొందరు, టీడీపీ నాయకులు వెళ్తే మంత్రులు లెక్కే చేయడం లేదని మరికొందరు అధ్యక్షులు ఇలా వరుస పెట్టి మంత్రులపై ఫిర్యాదులు చేశారు. వీటిన్నింటికి సమాధానం చెప్పండటూ మంత్రులను సీఎం అక్కడే నిలదీయడంతో వారంతా చాలా ఇబ్బందిపడ్డారు.

”కొమ్ములొచ్చాయన్న ఫీలింగ్ వీడండి… చంద్రబాబు ఒక్కరే కష్టపడుతున్నారన్న భావన జనంలో ఉంది. అది మంచిది కాదు” అంటూ తన పనితీరు ముందు మంత్రుల పనితీరు దారుణంగా ఉందని చంద్రబాబు తేల్చేశారు. అయితే గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు పనితీరు సూపర్ అంటూ సమావేశంలో పొగిడేశారు. దీంతో మిగిలిన మంత్రులు ఇబ్బందిగా ఫీల్ అయ్యారట. పద్దతి మార్చుకోకపోతే కొందరిని సాగనంపేందుకు కూడా సిద్ధమని తేల్చేశారు. కారుపై బుగ్గ లైట్ కాదు… మీ కారుకు రెడ్ లైట్ పడుతుందని పరోక్షంగా హెచ్చరించారు. కార్యకర్తలు వస్తే పనులు చేయాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే పనితీరు విషయంలో పీతల సుజాత, కొల్లు రవీంద్రతో పాటు ఎప్పటిలాగే రెవెన్యూ శాఖ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు.

First Published:  5 Jan 2016 12:30 AM GMT
Next Story