Telugu Global
NEWS

మీ కార్లు ఏమైనా ఆక్సిజన్ వదులుతాయా?

ఢిల్లీలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేతపై లగ్జరీ కార్ల తయారీ సంస్థలు సుప్రీంను ఆశ్రయించగా అక్కడ వాటికి చుక్కెదురైంది. డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ల నిలిపివేత నుంచి తమ కార్లకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ టయోటా, మెర్సిడిస్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. హైఎండ్ కార్ల వల్ల పర్యావరణానికి పెద్దగా హానీ ఉండదని కంపెనీలు వాదించాయి. అయితే సుప్రీం మాత్రం వారి వాదనతో ఏకీభవించలేదు. పెద్ద కార్లు  తక్కువ కాలుష్యం కలిగిస్తాయనేందుకు శాస్త్రీయ ఆధారాలుంటే […]

మీ కార్లు ఏమైనా ఆక్సిజన్ వదులుతాయా?
X

ఢిల్లీలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేతపై లగ్జరీ కార్ల తయారీ సంస్థలు సుప్రీంను ఆశ్రయించగా అక్కడ వాటికి చుక్కెదురైంది. డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ల నిలిపివేత నుంచి తమ కార్లకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ టయోటా, మెర్సిడిస్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. హైఎండ్ కార్ల వల్ల పర్యావరణానికి పెద్దగా హానీ ఉండదని కంపెనీలు వాదించాయి. అయితే సుప్రీం మాత్రం వారి వాదనతో ఏకీభవించలేదు. పెద్ద కార్లు తక్కువ కాలుష్యం కలిగిస్తాయనేందుకు శాస్త్రీయ ఆధారాలుంటే చూపాలంది. ఖరీదైన కారు ఏమైనా ఆక్సిజన్ విడుదల చేస్తాయా అని ప్రశ్నించింది. ఆ కార్లు కూడా కాలుష్యకారకాలనే విడుదల చేస్తాయని… కాబట్టి 2000 సీసీ కన్నా అధిక ఇంజన్ సామర్ధ్యం కలిగిన కార్ల రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేయాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. మార్చి 31 వరకూ 2000 సీసీ కన్నా అధిక ఇంజన్ సామర్థ్యమున్న కార్ల రిజిస్ట్రేషన్‌ను నిలపాల్సిందేనని స్పష్టం చేసింది. ధనవంతులు వాడే కార్లు ఆక్సిజన్ విడుదలు చేస్తాయా న్యాయస్థానం ప్రశ్నించింది.

First Published:  6 Jan 2016 3:53 AM GMT
Next Story