Telugu Global
NEWS

మాకు అన్నం కావాలి... పురుగులు కాదు

అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు రోడ్డెక్కారు. పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆందోళనకు దిగారు. క్లాక్‌ టవర్ వద్ద ధర్నా నిర్వహించారు. పురుగులున్న అన్నాన్ని ప్రదర్శించారు. హాస్టల్‌లో పెడుతున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎన్నిసార్లు వార్డన్‌కు విన్నవించుకున్నా స్పందన లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నాణ్యత లేని ఆహారం తిని పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాలేజ్‌ హాస్టల్‌లో పలువురు పేద విద్యార్థులు ఉంటూ చదువుకుంటుంటారు. స్థానిక అధికారులు వెంటనే స్పందించకుంటే సీఎం […]

మాకు అన్నం కావాలి... పురుగులు కాదు
X

అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు రోడ్డెక్కారు. పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆందోళనకు దిగారు. క్లాక్‌ టవర్ వద్ద ధర్నా నిర్వహించారు. పురుగులున్న అన్నాన్ని ప్రదర్శించారు. హాస్టల్‌లో పెడుతున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎన్నిసార్లు వార్డన్‌కు విన్నవించుకున్నా స్పందన లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నాణ్యత లేని ఆహారం తిని పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాలేజ్‌ హాస్టల్‌లో పలువురు పేద విద్యార్థులు ఉంటూ చదువుకుంటుంటారు. స్థానిక అధికారులు వెంటనే స్పందించకుంటే సీఎం వరకూ వెళ్తామని విద్యార్థులు హెచ్చరించారు.

First Published:  6 Jan 2016 3:23 AM GMT
Next Story