Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కు అదే మైనస్సా....

ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలకాబోతోంది. సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి నెగెటివ్ ప్రచార లేదు. మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా అంచనాలు కడుతున్న వేళ…. నాన్నకు ప్రేమతోపై ఓ నెగెటివ్ ప్రచారం ఊపందుకుంది. సినిమాలో కొన్ని సన్నివేశాల్ని ఎన్టీఆర్ కావాలనే తీయించారని, అది సినిమా రిజల్ట్ పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా రా-కట్ 4 గంటల నిడివి వచ్చింది. దాన్ని […]

ఎన్టీఆర్ కు అదే మైనస్సా....
X
ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలకాబోతోంది. సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి నెగెటివ్ ప్రచార లేదు. మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా అంచనాలు కడుతున్న వేళ…. నాన్నకు ప్రేమతోపై ఓ నెగెటివ్ ప్రచారం ఊపందుకుంది. సినిమాలో కొన్ని సన్నివేశాల్ని ఎన్టీఆర్ కావాలనే తీయించారని, అది సినిమా రిజల్ట్ పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
నాన్నకు ప్రేమతో సినిమా రా-కట్ 4 గంటల నిడివి వచ్చింది. దాన్ని సుకుమార్ 3 గంటలకు తగ్గించాడు. అలాగే సెన్సార్ కు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. కానీ 3 గంటల నిడివి సినిమాని సంక్రాంతి బరిలో నిలిపితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన ఎన్టీఆర్, దగ్గరుండి అందులోంచి మరో 25 నిమిషాల సన్నివేశాల్ని తొలిగించాడట. దీంతో చిత్రయూనిట్ దీనిపై తలోరకంగా స్పందిస్తోంది. కొంతమంది ఎన్టీఆర్ నిర్ణయం సరైనదే అంటుంటే…. మరికొందరు సినిమా ఫీల్ మొత్తం పోయిందంటున్నారు. మరి ఎవరి వాదన కరెక్టో తెలియాలంటే ….. జనవరి 13వరకు ఆగాల్సిందే.
First Published:  8 Jan 2016 7:05 PM GMT
Next Story