Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ సినిమాకి హృతిక్ ప్రచారం

 టాలీవుడ్ కు సంబంధించి బాలీవుడ్ హీరోలు మాట్లాడితే ఎక్కువగా మహేష్ బాబు ప్రస్తావన మాత్రమే వస్తుంటుంది. ఆ తర్వాత స్థానాల్లో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలు ఉంటారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను మాత్రం ఎవరూ గుర్తుచేసుకోరు. అయితే ఎన్టీఆర్ కోసం నేనున్నానంటున్నాడు హృతిక్ రోషన్. ఎవరూ ఊహించని విధంగా తారక్ కొత్త సినిమా నాన్నకు ప్రేమతో సినిమాకు ప్రచారం కల్పిస్తున్నాడు. ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన హృతిక్ […]

ఎన్టీఆర్ సినిమాకి హృతిక్ ప్రచారం
X
టాలీవుడ్ కు సంబంధించి బాలీవుడ్ హీరోలు మాట్లాడితే ఎక్కువగా మహేష్ బాబు ప్రస్తావన మాత్రమే వస్తుంటుంది. ఆ తర్వాత స్థానాల్లో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలు ఉంటారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను మాత్రం ఎవరూ గుర్తుచేసుకోరు. అయితే ఎన్టీఆర్ కోసం నేనున్నానంటున్నాడు హృతిక్ రోషన్. ఎవరూ ఊహించని విధంగా తారక్ కొత్త సినిమా నాన్నకు ప్రేమతో సినిమాకు ప్రచారం కల్పిస్తున్నాడు. ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన హృతిక్ రోషన్….. యంగ్ టైగర్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు.
తారక్ స్టెప్పులు తనకు ఎంతో ఇష్టమన్న హృతిక్… అతడు నటించిన నాన్నకు ప్రేమతో సినిమాను చూడాలనుకుంటున్నట్టు తెలిపాడు. కేవలం తన స్టెప్పులతోనే కాకుండా… నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఎన్టీఆర్…. నాన్నకు ప్రేమతో సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకోవాలని మనసారా కోరుకున్నాడు హృతిక్. స్వయంగా బాలీవుడ్ స్టార్ హృతిక్… తమ సినిమాను ప్రస్తావించడంతో నాన్నకు ప్రేమతో టీం ఉబ్బితబ్బిబ్బవుతోంది.
First Published:  9 Jan 2016 12:33 AM GMT
Next Story