Telugu Global
Cinema & Entertainment

రచ్చ-2కు రంగం సిద్ధం అవుతోందా?

పవన్ కల్యాణ్ పట్టించుకోకపోయినా…. సంపత్ నంది మాత్రం మెగా కాంపౌండ్ ను వీడట్లేదు. పవన్ ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూనే….. మరోవైపు రామ్ చరణ్ తో కూడా మరో సినిమా చేసేందుకు పావులు కదుపుతున్నాడు ఈ యంగ్ డైరక్టర్. గతంలో  చెర్రీతో కలిసి చేసిన రచ్చ సినిమాకే సీక్వెల్ కథ సిద్ధంచేసి మెగాపవర్ స్టార్ కు వినిపించాడట. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైన రామ్ చరణ్…. సంపత్ నంది చెప్పిన రచ్చ-2 స్టోరీలైన్ […]

రచ్చ-2కు రంగం సిద్ధం అవుతోందా?
X
పవన్ కల్యాణ్ పట్టించుకోకపోయినా…. సంపత్ నంది మాత్రం మెగా కాంపౌండ్ ను వీడట్లేదు. పవన్ ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూనే….. మరోవైపు రామ్ చరణ్ తో కూడా మరో సినిమా చేసేందుకు పావులు కదుపుతున్నాడు ఈ యంగ్ డైరక్టర్. గతంలో చెర్రీతో కలిసి చేసిన రచ్చ సినిమాకే సీక్వెల్ కథ సిద్ధంచేసి మెగాపవర్ స్టార్ కు వినిపించాడట. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైన రామ్ చరణ్…. సంపత్ నంది చెప్పిన రచ్చ-2 స్టోరీలైన్ విని ఎంతగానే ఇష్టపడ్డాడట. దాన్ని పూర్తి నిడివి స్క్రీన్ ప్లేగా మార్చి తీసుకురమ్మని సూచించాడట. చెర్రీ గ్రీన్ సిగ్నల్ తో రచ్చ-2 పట్టాలపైకి రావడానికి సిద్ధమౌతోందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్ చరణ్… రచ్చ-2కు కాల్షీట్లు ఇవ్వగలడా అనేదే సందేహం. ఎందుకంటే…. ఇంకా సురేందర్ రెడ్డి సినిమాను కంప్లీట్ చేయాలి. సో… ఈసారి కూడా సంపత్ నందికి కెరీర్ లో భారీ గ్యాప్ తప్పేలా లేదు.
First Published:  9 Jan 2016 7:03 PM GMT
Next Story