Telugu Global
Others

గ్రేటర్ లో ఓడితే మంత్రి పదవికి రాజీనామా

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే గెలుపని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ విపక్షాలకు సవాల్  చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే విపక్ష నేతలంతా రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంతమంది సినీస్టార్లు ప్రచారంలోకి […]

గ్రేటర్ లో ఓడితే మంత్రి పదవికి రాజీనామా
X
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే గెలుపని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ విపక్షాలకు సవాల్ చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే విపక్ష నేతలంతా రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంతమంది సినీస్టార్లు ప్రచారంలోకి వచ్చినా కేసీఆర్ ను మించిన స్టార్ లేడన్నారు. ఎన్నికల తర్వాత పొత్తులు ఉండే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు 100సీట్ల వరకు టీఆర్ఎస్ గెలిస్తే పొత్తుల అవసరం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రధాని మోడీ ఇప్పటి వరకు హైదరాబాద్ మొహం కూడా చూడలేదని.. బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతారని ఆయన ప్రశ్నించారు. బీజేపీని భారతీయ జోక్ పార్టీగా కేటీఆర్ అభివర్ణించారు. పాతబస్తీలో వెనుకబాటు తనానికి ఎంఐఎం కూడా ఓ కారణమని కేటీఆర్ విమర్శించారు. 18నెలల టీఆర్ఎస్ పాలనలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని.. రాష్ట్రంలో పెట్టుబడుల కల్పనకు ప్రణాలికలు రచిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన జరగకపోతే ఏపీలో కొత్త రాజధాని, ఎయిమ్స్, అంతర్జాతీయ ఎయిర్ పోర్టులు వచ్చేవా? అమరావతి రాజధాని లాంటి నిర్మాణాలు జరిగేవా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా అని.. తెలంగాణలోని 30శాతం జనాభా ఒక్క హైదరాబాద్ లోనే ఉందన్నారు. రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా నిలుస్తున్న హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడేలు ఉండేవి. కరెంట్ సమస్యతో పారిశ్రామికవేత్తలు ఇబ్బందిపడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అదే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే కరెంట్ సమస్యను అధికమించామని.. రాష్ట్రంలో కరెంట్ సమస్య లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు.
First Published:  11 Jan 2016 3:22 AM GMT
Next Story