Telugu Global
Cinema & Entertainment

సై అంటే సై అంటున్న సమంత, నిత్య‌

క్యూట్ బ్యూటీ సమంత పొట్టి సుందరి నిత్యామీనన్‌ కలసి మూడోసారి నటించేందుకు సిద్ధమవుతున్నారట. తొలిసారి నందినీ రెడ్డి ‘జబర్దస్త్’ సినిమాలో మెరిసిన సమంత, నిత్య… తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తిలోనూ తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదరహో అనిపించుకోవడంతో…. ఈ ముద్దుగుమ్మల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు దర్శకుడు కొరటాల శివ కూడా సిద్ధమవుతున్నాడట. జూనియన్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే…! మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందనున్న […]

సై అంటే సై అంటున్న సమంత, నిత్య‌
X

క్యూట్ బ్యూటీ సమంత పొట్టి సుందరి నిత్యామీనన్‌ కలసి మూడోసారి నటించేందుకు సిద్ధమవుతున్నారట. తొలిసారి నందినీ రెడ్డి ‘జబర్దస్త్’ సినిమాలో మెరిసిన సమంత, నిత్య… తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తిలోనూ తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదరహో అనిపించుకోవడంతో…. ఈ ముద్దుగుమ్మల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు దర్శకుడు కొరటాల శివ కూడా సిద్ధమవుతున్నాడట. జూనియన్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే…! మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్‌లు లీడ్ హీరోయిన్లు‌గా ఫైనల్ అయ్యారని తెలిసింది.అయితే సినిమాలో సమంత, నిత్య పాత్రలు ఎంతో ప్రాధాన్యతతో ఉన్నవని అంటూన్నారు. ఇద్దరు పోటాపోటిగా నటించే విధంగా కొరటాల శివ రూపొందిస్తున్నారని టీం సభ్యులు భావిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి… ముచ్చటగా మూడోసారి చేతులు కలపబోతున్న సమంత, నిత్యా మీనన్ యంగ్ టైగర్ ఎనర్జీకి ఎలాంటి కిక్ ఇస్తారో చూడాలి.ఇద్ద‌రు గ్లామ‌ర్ బ్యూటీస్ వుంటే పండ‌గే క‌దా అభిమానుల‌కు. నిత్య మీన‌న్ గ్లామ‌ర్ తో పాటు… యాక్టింగ్ కూడా పండించగ‌ల టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనే విష‌యం తెలిసిందే.

First Published:  10 Jan 2016 7:12 PM GMT
Next Story