Telugu Global
Cinema & Entertainment

పవన్ ఫ్యాన్స్ కు మరో సంక్రాంతి కానుక

సాంబడిపై సర్దార్ ఊరేగుతూ తీసిన ఫొటో ఇప్పటికే విడుదలైంది. బుల్లెట్ పై అలీ… అలీపై పవన్… పక్కన ఓవైపు బ్రహ్మాజీ ఇలా పవన్ కల్యాణ్ దిగిన లేటెస్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ ఫొటో టాలీవుడ్ ను ఊపేస్తోంది. చూసినకొద్దీ చూడాలనిపించేలా ఉంది ఆ స్టిల్. పవన్… సంక్రాంతికి తన ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ అందించాడని అంతా అనుకున్నారు. కానీ పవన్ మాత్రం అలా అనుకోవట్లేదు. ఏదో క్యాజువల్ గా విడుదల చేసిన స్టిల్ అది. సంక్రాంతికి […]

పవన్ ఫ్యాన్స్ కు మరో సంక్రాంతి కానుక
X
PKసాంబడిపై సర్దార్ ఊరేగుతూ తీసిన ఫొటో ఇప్పటికే విడుదలైంది. బుల్లెట్ పై అలీ… అలీపై పవన్… పక్కన ఓవైపు బ్రహ్మాజీ ఇలా పవన్ కల్యాణ్ దిగిన లేటెస్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ ఫొటో టాలీవుడ్ ను ఊపేస్తోంది. చూసినకొద్దీ చూడాలనిపించేలా ఉంది ఆ స్టిల్. పవన్… సంక్రాంతికి తన ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ అందించాడని అంతా అనుకున్నారు. కానీ పవన్ మాత్రం అలా అనుకోవట్లేదు. ఏదో క్యాజువల్ గా విడుదల చేసిన స్టిల్ అది. సంక్రాంతికి మరింత స్పెషల్ గా మరో కానుక సిద్ధంచేస్తున్నాడట పవన్. అన్నీ అనుకున్నట్టు జరిగితే…. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి… మరో హాట్ హాట్ టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట పవన్. తాజా వార్తతో పవన్ ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే. అటు పవన్ మాత్రం తన సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ను ఏకథాటిగా కొనసాగించాలని నిర్ణయించాడు. హైదరాబాద్ లో ఈనెల 5న ప్రారంభమైన షూటింగ్… ఈనెలాఖరుకు 27వ తేదీ వరకు కొనసాగుతుంది. దీంతో సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది.
First Published:  10 Jan 2016 7:22 PM GMT
Next Story