Telugu Global
Cinema & Entertainment

శృతి హాస‌న్‌కి ఝ‌ల‌క్ ఇచ్చిన శైల‌జ

హీరోలతో రొమాన్స్ చేయడం సౌతిండియన్ క్రేజీ బ్యూటీ శృతి హాసన్‌కు కొత్త కాదు. గబ్బర్ సింగ్‌లో పవన్, రేసుగుర్రంలో బన్నీ, ఎవడులో రామ్ చరణ్‌తో నటించి సక్సెస్ అందుకున్న కమల్ హాసన్ గారాలపట్టి… మరోసారి రామ్ చరణ్‌తో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుందనే ప్రచారం మొన్నటి వరకూ సాగింది. ‘తని ఒరువన్’లో నయనతార పోషించిన రోల్‌‌ను..తెలుగు రీమేక్‌లో శృతిహాసన్ నటించనుందనే టాక్ బాగా వినిపించింది. అయితే సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో అల్లు అరవింద్ నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ […]

శృతి హాస‌న్‌కి ఝ‌ల‌క్ ఇచ్చిన శైల‌జ
X

హీరోలతో రొమాన్స్ చేయడం సౌతిండియన్ క్రేజీ బ్యూటీ శృతి హాసన్‌కు కొత్త కాదు. గబ్బర్ సింగ్‌లో పవన్, రేసుగుర్రంలో బన్నీ, ఎవడులో రామ్ చరణ్‌తో నటించి సక్సెస్ అందుకున్న కమల్ హాసన్ గారాలపట్టి… మరోసారి రామ్ చరణ్‌తో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుందనే ప్రచారం మొన్నటి వరకూ సాగింది. ‘తని ఒరువన్’లో నయనతార పోషించిన రోల్‌‌ను..తెలుగు రీమేక్‌లో శృతిహాసన్ నటించనుందనే టాక్ బాగా వినిపించింది. అయితే సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో అల్లు అరవింద్ నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ‘నేను – శైలజ’ మూవీతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న అందాల భామ కీర్తి సురేశ్… ‘తని ఒరువన్’ రీమేక్‌లో శృతి హాసన్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ రేంజ్‌ను ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్… తని ఒరువన్ రీమేక్ లో నటించేందుకు ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందట. రామ్ చరణ్ గత చిత్రం బ్రూస్ లీ ఫెయిల్యూర్ కావడంతో… నయా మూవీ బడ్జెట్‌ను సాధ్యమైనంతగా తగ్గించాలని భావిస్తున్న మూవీ మేకర్లు… శృతి హాసన్ ప్లేస్‌లో కీర్తి సురేశ్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. కీర్తీ సురేశ్‌కు అవకాశం ఇస్తే అప్ కమింగ్ బ్యూటీని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని… అమ్మడు రెమ్యూనరేషన్ రూ. 30 లక్షల లోపే ఉంటుందని భావించిన నిర్మాత అల్లు అరవింద్… ఈ విషయంలో దర్శకుడు, హీరోను ఒప్పించినట్టు తెలిసింది. ఏదేమైనా… రామ్ చరణ్ నయా మూవీ కాస్ట్ కట్టింగ్ పుణ్యమాని… అప్ కమింగ్ బ్యూటీ కీర్తి సురేశ్‌కు… అనుకోని బంపర్ ఆఫర్ దక్కినట్టే కనిపిస్తోంది.

First Published:  10 Jan 2016 9:05 PM GMT
Next Story