Telugu Global
Cinema & Entertainment

ప్రేమికుల రోజున బన్నీ పాటలు

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు అనే సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పాటల్ని…. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఐటెంసాంగ్ షూటింగ్ జరుగుతోంది. మొన్నటివరకు ఈ ఐటెంసాంగ్ కోసం అంజలిని అనుకున్నారు. కానీ ఆ స్థానాన్ని లోఫర్ భామ దిషా పటానీతో […]

ప్రేమికుల రోజున బన్నీ పాటలు
X
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు అనే సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పాటల్ని…. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఐటెంసాంగ్ షూటింగ్ జరుగుతోంది. మొన్నటివరకు ఈ ఐటెంసాంగ్ కోసం అంజలిని అనుకున్నారు. కానీ ఆ స్థానాన్ని లోఫర్ భామ దిషా పటానీతో భర్తీ చేశారు. ప్రస్తుతం ఆమె-బన్నీ పాల్గొనగా కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. మూవీలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బోయపాటి శ్రీను ఫస్ట్ లుక్ టీజర్ ను కట్ చేశాడు. మెగా కాంపౌండ్ ఓకే చెప్పిన వెంటనే… సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదలవుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను… సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
First Published:  11 Jan 2016 7:03 PM GMT
Next Story