Telugu Global
Others

రింగ్ అవ‌దు... అయిన‌ట్టే ఉంటుంది..!

ప్యాంటు జేబులోనో, ష‌ర్టు జేబులోనో  వైబ్రేష‌న్లో ఉన్న ఫోను, రింగ్ అవ‌క‌పోయినా క‌దులుతున్న‌ట్టే ఉంటే…అదొక మాన‌సిక భ్రాంతి అంటున్నారు నిపుణులు. ప్ర‌తిప‌దిమంది ఫోను వినియోగ‌దారుల్లో ఒక‌రు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నార‌ని, దీన్ని ఫాంట‌మ్ వైబ్రేష‌న్ సిండ్రోమ్ అంటార‌ని వారు చెబుతున్నారు. దీన్ని శ‌రీరం అల‌వాటు ప‌డిన ఒక స్పంద‌న‌గా చెప్ప‌వ‌చ్చ‌ని అమెరికా, అట్లాంటాలోని  జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ రాబ‌ర్ట్‌ రోసెన్బ‌ర్గ‌ర్ వివ‌రించారు. ఒక్క‌సారి ఫోనుని ప్యాకెట్‌లో పెట్టుకున్నాక అది క‌ళ్ల‌ద్దాల్లాగే […]

రింగ్ అవ‌దు... అయిన‌ట్టే ఉంటుంది..!
X

ప్యాంటు జేబులోనో, ష‌ర్టు జేబులోనో వైబ్రేష‌న్లో ఉన్న ఫోను, రింగ్ అవ‌క‌పోయినా క‌దులుతున్న‌ట్టే ఉంటే…అదొక మాన‌సిక భ్రాంతి అంటున్నారు నిపుణులు. ప్ర‌తిప‌దిమంది ఫోను వినియోగ‌దారుల్లో ఒక‌రు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నార‌ని, దీన్ని ఫాంట‌మ్ వైబ్రేష‌న్ సిండ్రోమ్ అంటార‌ని వారు చెబుతున్నారు.

దీన్ని శ‌రీరం అల‌వాటు ప‌డిన ఒక స్పంద‌న‌గా చెప్ప‌వ‌చ్చ‌ని అమెరికా, అట్లాంటాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ రాబ‌ర్ట్‌ రోసెన్బ‌ర్గ‌ర్ వివ‌రించారు. ఒక్క‌సారి ఫోనుని ప్యాకెట్‌లో పెట్టుకున్నాక అది క‌ళ్ల‌ద్దాల్లాగే శ‌రీరంలో భాగంగా అయిపోతుంద‌ని, అది అక్క‌డ ఉన్న‌ద‌న్న విష‌యాన్నే మ‌నం మ‌ర్చిపోతామంటున్నారు ఆయ‌న‌. అయితే ఇలాంట‌పుడు ధ‌రించిన బ‌ట్ట‌ల‌నుండి, కండ‌రాల క‌ద‌లిక‌ల‌నుండి వ‌చ్చే శ‌బ్దాలు, మ‌న‌కు ఫోన్ వైబ్రేష‌న్‌లా భ్రాంతిని క‌లిగిస్తాయ‌ని రాబ‌ర్ట్ చెబుతున్నారు. కంప్యూట‌ర్స్ ఇన్ హ్యూమ‌న్ బిహేవియ‌ర‌ల్ జ‌ర్న‌ల్‌లో దీని తాలూకూ అధ్య‌య‌నాన్ని ప్ర‌చురించారు.

గ్రాడ్యుయేష‌న్ చ‌దువుతున్న కొంత‌మంది విద్యార్థుల‌పై అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించ‌గా అందులో 90శాతం మంది ఫోన్ రింగ్ కాక‌పోయినా అయిన‌ట్టుగా త‌మ‌కు భ్రాంతి క‌లుగుతోంద‌ని చెప్పార‌ని డాక్ట‌ర్ రాబ‌ర్ట్‌ బిబిసికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. త‌మ చుట్టూ ఉన్న టెక్నాల‌జీ మ‌నుషుల‌ను విప‌రీత‌మైన ఆందోళ‌న‌కు గురిచేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. కాల్స్‌, ఇమెయిల్స్‌, మెసేజ్‌లు ఇవ‌న్నీ మ‌న‌ల్ని ప్ర‌శాంతంగా ఉండ‌నీయ‌డం లేద‌ని, టెన్ష‌న్‌కు ఒత్తిడికి గురిచేస్తున్నాయ‌ని ఈ కార‌ణంగానే మ‌న‌కు ఇలాంటి భ్రాంతులు క‌లుగుతున్నాయ‌ని రాబ‌ర్ట్ అంటున్నారు.

First Published:  11 Jan 2016 1:01 PM GMT
Next Story