Telugu Global
Others

"ఖడ్గం" డైలాగ్‌ను నమ్ముకున్న కేటీఆర్‌

 గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త నినాదం అందుకుంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి కేటీఆర్ ప్రతిరోజూ బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాల్లో బిజీగా ఉంటూనే అన్ని టీవీ ఛానల్స్ చుట్టూ తిరుగుతూ టీఆర్ఎస్ ను ఎందుకు గెలిపించాలో చెబుతున్నారు.  కేటీఆర్.. సెటిలర్స్ ను ఆకట్టుకునేందుకు మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా సెటిలర్లే.. స్థానికులు ఎంత మంది ఉన్నారు? ఆమాటకొస్తే నేనూ […]

ఖడ్గం డైలాగ్‌ను నమ్ముకున్న కేటీఆర్‌
X
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త నినాదం అందుకుంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి కేటీఆర్ ప్రతిరోజూ బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాల్లో బిజీగా ఉంటూనే అన్ని టీవీ ఛానల్స్ చుట్టూ తిరుగుతూ టీఆర్ఎస్ ను ఎందుకు గెలిపించాలో చెబుతున్నారు. కేటీఆర్.. సెటిలర్స్ ను ఆకట్టుకునేందుకు మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా సెటిలర్లే.. స్థానికులు ఎంత మంది ఉన్నారు? ఆమాటకొస్తే నేనూ సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యానని కేటీఆర్ గుర్తు చేశారు. గౌలిపురా, శాలిబండ వంటి ప్రాంతాల్లో తప్ప అన్ని చోట్లా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.
అంతేకాదు ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ గ్రేటర్ ప్రజల్లోకి వెళ్తామన్నారు కేటీఆర్. 60ఏళ్లుగా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చిన గ్రేటర్ ప్రజలు ఈసారి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గతంలో గ్రేట‌ర్ మేయర్ ప‌గ్గాల‌ను టీడీపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు అప్పగిస్తే వారేం చేశారో మీరే చూశార‌ని… పక్కా ప్రణాళికతో హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ను ఈసారి బలపర్చాలని కేటీఆర్ ప్రజలను కోరారు. ఇప్పటికే ప్రజలను ఆకట్టుకుంటూ ప్రచారంలో ముందున్న టీఆర్ఎస్ మరో రెండు రోజుల్లో విడుదల చేయబోయే ఎన్నికల మ్యానిఫెస్టోలో గ్రేటర్ వాసులపై ఇంకెన్ని వరాలు కురిపిస్తుందో చూడాలి.
First Published:  13 Jan 2016 1:29 AM GMT
Next Story