Telugu Global
Cinema & Entertainment

ఫ‌స్ట్ పార్ట్ హిట్ కాక పోయినా సీక్వెలా..!

సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొంది.. తెలుగులోకి డబ్ అయిన ‘చంద్రకళ’ కొంతకాలం కిందట విడుదలైంది. తమిళంలో “అరైన్మణి” పేరుతో రూపొందిన ఈ సినిమా తెలుగులోకి డబ్ అయితే అయ్యిందని కానీ.. ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. హన్సిక ప్రధాన పాత్ర పోషించిన ఈ థ్రిల్లింగ్ సబ్జెక్టు తెలుగు వారిలో ఆసక్తిని రేపలేకపోయింది. అయితే తమిళంలో మాత్రం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలిచింది. మరి ఆ సక్సెస్ ను సొమ్ము చేసుకోవడానికి సుందర్.సి అండ్ కో దానికి సీక్వెల్ […]

ఫ‌స్ట్ పార్ట్ హిట్ కాక పోయినా సీక్వెలా..!
X

సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొంది.. తెలుగులోకి డబ్ అయిన ‘చంద్రకళ’ కొంతకాలం కిందట విడుదలైంది. తమిళంలో “అరైన్మణి” పేరుతో రూపొందిన ఈ సినిమా తెలుగులోకి డబ్ అయితే అయ్యిందని కానీ.. ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. హన్సిక ప్రధాన పాత్ర పోషించిన ఈ థ్రిల్లింగ్ సబ్జెక్టు తెలుగు వారిలో ఆసక్తిని రేపలేకపోయింది. అయితే తమిళంలో మాత్రం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలిచింది. మరి ఆ సక్సెస్ ను సొమ్ము చేసుకోవడానికి సుందర్.సి అండ్ కో దానికి సీక్వెల్ ను రూపొందించింది.

“అరైన్మణి-2” పేరుతో ఈ సినిమా రూపొందిందక్కడ. మరి తొలి పార్ట్‌ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయినా.. ఈ సీక్వెల్ పార్టును కూడా డబ్ చేస్తుండటం విశేషం. ‘చంద్రకళ-2” గా ఈ సినిమా విడుదల కానుంది. జనవరి 22వ తేదీన ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళంలో పాటు తెలుగులో ఇది విడుదల కానుంది. ఈ సారి హన్సికకు తోడు త్రిష కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా తోడయ్యింది. మరి ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాతో పలకరించనున్న నేపథ్యంలో ఫస్ట్ పార్ట్ ఫెయిలయినా.. ఇదైనా సక్సెస్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. అయితే.. తెలుగు సుందర్.సి మార్కు సినిమాలు ఈ మధ్యకాలంలో అంతగా ఆడటం లేదు.

ఆయన తమిళంలో రూపొందించిన సినిమాలు ఒక్కొక్కటిగా డబ్ అవుతూ.. వచ్చినట్టుగానే వెళ్లిపోతున్నాయి. మరి ఈ సారైనా ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తుందేమో చూడాలి!

First Published:  13 Jan 2016 7:02 PM GMT
Next Story