Telugu Global
Cinema & Entertainment

ఈ బుజ్జి మల్టీస్టారర్ కు రిలీజ్ డేట్ ఫిక్స్

మల్టీస్టారర్లలో కూడా పలు రకాలుంటాయి. బడా స్టార్లు కలిస్తేనే మల్టీస్టారర్ అనుకుంటే తప్పు. ఊహించని హీరోలు కలిసినా ఆ సినిమా కచ్చితంగా హైప్ వస్తుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మంచు విష్ణు, రాజ్ తరుణ్ సినిమా అలాంటిదే. వీళ్లిద్దరూ కలిసి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ ఓ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, సోనారికా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద సినిమా తర్వాత విష్ణు చేస్తున్న మరో మల్టీస్టారర్ […]

ఈ బుజ్జి మల్టీస్టారర్ కు రిలీజ్ డేట్ ఫిక్స్
X
మల్టీస్టారర్లలో కూడా పలు రకాలుంటాయి. బడా స్టార్లు కలిస్తేనే మల్టీస్టారర్ అనుకుంటే తప్పు. ఊహించని హీరోలు కలిసినా ఆ సినిమా కచ్చితంగా హైప్ వస్తుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మంచు విష్ణు, రాజ్ తరుణ్ సినిమా అలాంటిదే. వీళ్లిద్దరూ కలిసి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ ఓ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, సోనారికా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద సినిమా తర్వాత విష్ణు చేస్తున్న మరో మల్టీస్టారర్ మూవీ ఇది. పైగా… పంజాబీలో హిట్టయిన ఓ కామెడీ సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కుతుండడంతో అందర్లో ఆసక్తి నెలకొంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 18న విడుదల చేయాలని నిర్ణయించారు. వరుస విజయాలతో ఊపుమీదున్న రాజ్ తరుణ్… ఈ మూవీతో మరో సక్సెస్ పై కన్నేశాడు. ఇన్నాళ్లూ తన బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ కు తగ్గ పాత్రలు చేసిన ఈ కుర్రాడు… ఫస్ట్ టైం ఈ మూవీలో ఫుల్ లెంగ్త్ కామెడీ చేయబోతున్నాడు.
First Published:  15 Jan 2016 7:04 PM GMT
Next Story