Telugu Global
Cinema & Entertainment

రకుల్ కు సగం చెక్కు ఇచ్చిన నితిన్

క్రేజ్ లో ఉన్న హీరోయిన్ ను అస్సలు వదులుకోడు నితిన్. కెరీర్ ప్రారంభం నుంచి ఇదే పద్దతి ఫాలో అవుతున్నాడు. అప్పట్లో లైమ్ లైట్ లో ఉన్న కాజల్, ప్రియమణి, త్రిష, ఇలియానా… ఇలా హాట్ హీరోయిన్లు అందరితో సినిమాలు చేశాడు. మరి ఇప్పుడు హాట్ ఎవరు…? కచ్చితంగా అది రకుల్ ప్రీత్ సింగే. అందుకే ఆమెకి కూడా గాలమేశాడు. తన నెక్ట్స్ సినిమా కన్ ఫర్మ్ కాకపోయినా… హీరోయిన్ ను మాత్రం బుక్ చేసుకున్నాడు. రకుల్ […]

రకుల్ కు సగం చెక్కు ఇచ్చిన నితిన్
X
క్రేజ్ లో ఉన్న హీరోయిన్ ను అస్సలు వదులుకోడు నితిన్. కెరీర్ ప్రారంభం నుంచి ఇదే పద్దతి ఫాలో అవుతున్నాడు. అప్పట్లో లైమ్ లైట్ లో ఉన్న కాజల్, ప్రియమణి, త్రిష, ఇలియానా… ఇలా హాట్ హీరోయిన్లు అందరితో సినిమాలు చేశాడు. మరి ఇప్పుడు హాట్ ఎవరు…? కచ్చితంగా అది రకుల్ ప్రీత్ సింగే. అందుకే ఆమెకి కూడా గాలమేశాడు. తన నెక్ట్స్ సినిమా కన్ ఫర్మ్ కాకపోయినా… హీరోయిన్ ను మాత్రం బుక్ చేసుకున్నాడు. రకుల్ కు ఏకంగా సగం పారితోషికాన్ని అందించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అ…ఆ అనే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా తర్వాత చేయబోయే మూవీ గురించి ప్రస్తుతానికైతే నితిన్ దగ్గర ఎలాంటి ప్లాన్స్ లేవు. కాకపోతే తన నెక్ట్స్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి తీసుకురావాలనే క్లారిటీ మాత్రం ఈ హీరోకు ఉంది. అందుకే ఆ నెలల్లో రకుల్ కాల్షీట్లు బుక్ చేసుకున్నాడు నితిన్. హాట్ హీరోయిన్ బుక్కయిపోయింది కాబట్టి… తర్వాత కథ-దర్శకుడు గురించి తాపీగా ఆలోచించుకోవచ్చనేది నితిన్ ఫీలింగ్.
First Published:  15 Jan 2016 7:03 PM GMT
Next Story