Telugu Global
Others

పెట్రోల్‌ పోటు " మరోసారి మోదీ సర్కార్ దొంగదెబ్బ

అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్నా దాని ఫలాలు మాత్రం సామన్యులకు అందకుండా కేంద్రం మరోసారి అడ్డుపడింది. అంతర్జాతీయంగా ధరలు పతనం కావడంతో చమురు కంపెనీలు శుక్రవారం పెట్రోల్‌పై 32 పైసలు, డిజీల్‌పై 85 పైసలు తగ్గించాయి. అయితే గోతికాడ నక్కలా నక్కి ఉన్న కేంద్రం చమురు కంపెనీలు ధరలు తగ్గించగానే ఎక్సైజ్ సుంకం పెంచేసింది.  పెట్రోల్‌పై లీటర్‌కు 75 పైసలు, డీజిల్‌పై రూ. 1.83 పైసలు వడ్డించేసేంది. దీని ద్వారా కేంద్రానికి అదనంగా మూడు వేల 700 కోట్ల […]

పెట్రోల్‌ పోటు  మరోసారి మోదీ సర్కార్ దొంగదెబ్బ
X

అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్నా దాని ఫలాలు మాత్రం సామన్యులకు అందకుండా కేంద్రం మరోసారి అడ్డుపడింది. అంతర్జాతీయంగా ధరలు పతనం కావడంతో చమురు కంపెనీలు శుక్రవారం పెట్రోల్‌పై 32 పైసలు, డిజీల్‌పై 85 పైసలు తగ్గించాయి. అయితే గోతికాడ నక్కలా నక్కి ఉన్న కేంద్రం చమురు కంపెనీలు ధరలు తగ్గించగానే ఎక్సైజ్ సుంకం పెంచేసింది. పెట్రోల్‌పై లీటర్‌కు 75 పైసలు, డీజిల్‌పై రూ. 1.83 పైసలు వడ్డించేసేంది. దీని ద్వారా కేంద్రానికి అదనంగా మూడు వేల 700 కోట్ల ఆదాయం రానుంది.

యూపీఏ హయాంలో అంతర్జాతీయంగా చమురు బ్యారల్‌ ధర 160 డాలర్ల వరకు వెళ్లింది. ఆ సమయంలో ధరలు పెంచితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ గగ్గోలు పెట్టింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు బ్యారల్‌ ధర 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 30 డాలర్ల దిగువకు పడిపోయింది. అయినా సరే కేంద్రం ఎక్సైజ్ సుంకం విధిస్తూ దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గకుండా అడ్డుకుంటోంది. ప్రస్తుత ధరల ప్రకారం మనదేశంలో లీటర్ పెట్రోల్‌ ధర 19 రూపాయలు, డీజిల్‌ లీటర్‌ 15 రూపాయలకు రావాలి. కానీ కేంద్ర వైఖరితో అది జరగడం లేదు. పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు తగ్గించగానే ఇది సంక్రాంతి కానుక అంటూ ప్రకటనలు చేసిన బీజేపీ నేతలు … కేంద్రం ఎక్సైజ్‌ సుంకం పెంచాక మూగబోయారు.

First Published:  15 Jan 2016 10:34 PM GMT
Next Story