Telugu Global
Others

"ఓటి కుండ"కు సౌండ్‌ ఎక్కువంటే ఇదే కాబోలు!

ఆనం బ్రదర్స్‌ టీడీపీలో చేరిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నెల్లూరు జిల్లా తెలుగు తమ్ముళ్లే షాక్‌ అవుతున్నారు. అదేదో రెండు రాజ్యాల మధ్య వియ్యం కుదిరినట్టు… రెండు పార్టీలు విలీనం జరిగినట్టు ఆనం బ్రదర్స్ ఇస్తున్న బిల్డప్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఒక వైపు రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందని చెబుతున్న ఆనం బ్రదర్స్ .. టీడీపీలో రెండో విడత జాయినింగ్‌కు చేస్తున్న ఖర్చు చూసి నోరెళ్లబెడుతున్నారు. నెల క్రితమే ఆనం బ్రదర్స్ విజయవాడలో చంద్రబాబును కలిసి […]

ఓటి కుండకు సౌండ్‌ ఎక్కువంటే ఇదే కాబోలు!
X

ఆనం బ్రదర్స్‌ టీడీపీలో చేరిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నెల్లూరు జిల్లా తెలుగు తమ్ముళ్లే షాక్‌ అవుతున్నారు. అదేదో రెండు రాజ్యాల మధ్య వియ్యం కుదిరినట్టు… రెండు పార్టీలు విలీనం జరిగినట్టు ఆనం బ్రదర్స్ ఇస్తున్న బిల్డప్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఒక వైపు రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందని చెబుతున్న ఆనం బ్రదర్స్ .. టీడీపీలో రెండో విడత జాయినింగ్‌కు చేస్తున్న ఖర్చు చూసి నోరెళ్లబెడుతున్నారు.

నెల క్రితమే ఆనం బ్రదర్స్ విజయవాడలో చంద్రబాబును కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతటితో ఆనం బ్రదర్స్ టీడీపీ వాళ్లు అయిపోయారని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు జరిగింది నిశ్చిత్తార్ధం మాత్రమేనని బ్రదర్స్ ప్రకటించారు. తమ రేంజ్‌లో మరోసారి భారీగా జాయినింగ్ ఉంటుందని చెప్పి ఇప్పుడు అన్నంత పని చేశారు. అదేదో బాలకృష్ణ సినిమా తరహాలో ప్రత్యేకంగా రెండు రైళ్ళు వేసుకుని నెల్లూరు నుంచి విజయవాడ బయలుదేరారు. అంతేనా ప్రకటించి మరీ వెయ్యి వాహనాలేసుకుని హైవే మీదకు దూసుకొచ్చారు. ఈ తంతు చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవాల్సింది. పెద్దపెద్ద నేతలు పార్టీలు మారారు గానీ మరీ ఈ తరహాలో రైళ్లు, వందల సుమోలు వేసుకుని పక్కపార్టీలోకి దూరిన దాఖలాలు లేవంటున్నారు. పైగా సంక్రాంతి ప్రయాణానికి సీట్లు దొరక్క జనం అల్లాడుతుంటే ఇప్పుడు స్పెషల్ ట్రైన్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. బహిరంగ సభ ఏదో లోకల్‌లోనే పెడితే చంద్రబాబు వచ్చేవారు కదా అని అంటున్నారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం అయినప్పుడు కూడా ఈ బిల్డప్ చూడలేదంటున్నారు.

నెల్లూరు పాత టీడీపీ నేతలు మాత్రం ఆనం దూకుడును మౌనంగా గమనిస్తున్నారు. మంచి కుండ కన్నా ఓటి కుండకే సౌండ్ ఎక్కువంటే ఇదే కాబోలు అంటున్నారు. రైళ్లు, వెయ్యి వాహనాలకు పెట్టిన ఖర్చును రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తే కాసింతైనా మంచి జరిగేది కదా అంటున్నారు. అయినా ఆనం గారు పార్టీ చేంజ్‌ అంటే ఆ మాత్రం హడావుడి లేకుంటే వారి హిస్టరికే అవమానం కదా!

First Published:  17 Jan 2016 2:04 AM GMT
Next Story