Telugu Global
Others

సమంతపై మహేష్‌ ఆగ్రహం

మహేష్‌బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్‌ అయినా ఎగిరిగంతెస్తారు. కానీ సమంత మాత్రం చేతికొచ్చిన ఆ అవకాశాన్ని సరిగా క్యాష్ చేసుకోలేకపోతోంది. మహేశ్ బ్రహ్మోత్సవం సినిమాలో కాజల్, ప్రణీతతో పాటు సమంత నటించాల్సి ఉంది. ఇప్పటికే కాజల్, ప్రణీతలు షూటింగ్‌లో బిజీగా ఉండగా సమంత మాత్రం ఇంకా జాయిన్ కాలేదు. ప్రస్తుతం అమ్మడు తమిళ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండడమే కారణం. సమంత కారణంగా షూటింగ్‌ అనుకున్నంత స్పీడ్‌గా ముందుకు సాగడం లేదు. దీనిపై మహేష్‌బాబు ఆగ్రహం […]

సమంతపై మహేష్‌ ఆగ్రహం
X

మహేష్‌బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్‌ అయినా ఎగిరిగంతెస్తారు. కానీ సమంత మాత్రం చేతికొచ్చిన ఆ అవకాశాన్ని సరిగా క్యాష్ చేసుకోలేకపోతోంది. మహేశ్ బ్రహ్మోత్సవం సినిమాలో కాజల్, ప్రణీతతో పాటు సమంత నటించాల్సి ఉంది. ఇప్పటికే కాజల్, ప్రణీతలు షూటింగ్‌లో బిజీగా ఉండగా సమంత మాత్రం ఇంకా జాయిన్ కాలేదు. ప్రస్తుతం అమ్మడు తమిళ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండడమే కారణం. సమంత కారణంగా షూటింగ్‌ అనుకున్నంత స్పీడ్‌గా ముందుకు సాగడం లేదు. దీనిపై మహేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఒకరి కోసం సినిమా షెడ్యూలే మారిపోయే పరిస్థితి వస్తుందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. సమంత వల్ల చిత్రం విడుదల తేదీ కూడా తారుమారయ్యే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 29న బ్రహ్మోత్సవం విడుదల చేయాలని భావిస్తున్నారు. సమంత కారణంగా అది ఆలస్యమయ్యే పరిస్థితి ఉండడంతో చిత్ర యూనిట్ పునరాలోచనలో పడిందని చెబుతున్నారు. సమంత ప్లేస్‌లో రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకునేందుకు దర్శక నిర్మాతలు దాదాపు ఫిక్స్ అయ్యారని టాక్. చూడాలి కొద్ది రోజుల్లోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. చాన్స్ వస్తే మాత్రం నాన్నకు ప్రేమతో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రకుల్‌కు పండుగే.

First Published:  16 Jan 2016 9:00 PM GMT
Next Story