Telugu Global
Cinema & Entertainment

సోగ్గాడి కలెక్షన్లు ప్రకటించిన నాగ్.. ఇంకా ఏమన్నారంటే!

ఇటీవల విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సక్సెస్‌పై హీరో నాగార్జున హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. సినిమా కలెక్షన్లతో పాటు పలు విషయాలను నాగ్ పంచుకున్నారు. విడుదలైన తొలి రోజు సినిమా ఏపీ, తెలంగాణలో రూ. 5 కోట్లు వసూలు చేసిందని చెప్పారు. రెండు, మూడో రోజు కూడా రోజుకు 5 కోట్ల చొప్పున వసూలు చేసిందన్నారు. తన గత చిత్రాలతో పోలిస్తే ఇదో రికార్డ్ అన్నారు. ఓవర్‌సిస్‌లో […]

సోగ్గాడి కలెక్షన్లు ప్రకటించిన నాగ్.. ఇంకా ఏమన్నారంటే!
X

ఇటీవల విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సక్సెస్‌పై హీరో నాగార్జున హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. సినిమా కలెక్షన్లతో పాటు పలు విషయాలను నాగ్ పంచుకున్నారు. విడుదలైన తొలి రోజు సినిమా ఏపీ, తెలంగాణలో రూ. 5 కోట్లు వసూలు చేసిందని చెప్పారు. రెండు, మూడో రోజు కూడా రోజుకు 5 కోట్ల చొప్పున వసూలు చేసిందన్నారు. తన గత చిత్రాలతో పోలిస్తే ఇదో రికార్డ్ అన్నారు. ఓవర్‌సిస్‌లో ఇప్పటి వరకు 500k డాలర్లు వసూలు చేసిందన్నారు.

ఎక్కువ సినిమాల విడుదల కారణంగా కేవలం 450 థియేటర్లలో మాత్రమే విడుదల చేయాల్సి వచ్చిందన్నారు. వచ్చే వారం థియేటర్ల సంఖ్యను 600కు పెంచుతామన్నారు. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు నుంచి సినిమాకు ప్రేక్షకాధరణ మరింత పెరిగిందన్నారు. కొన్ని చోట్ల మహిళల ఒత్తిడితో రాత్రి 12.30కు కూడా అదనపు షోలు వేయాల్సి వస్తోందన్నారు. ఓవర్‌సీస్‌లోనూ కలెక్షన్లు బాగున్నాయన్నారు. బంగార్రాజు క్యారెక్టర్ ప్రభావం జనంపై బాగా ఉందన్నారు.

Click to Read:

railway-toilets

anam

First Published:  17 Jan 2016 6:37 AM GMT
Next Story