Telugu Global
Others

కేసీఆర్‌తో బాలకృష్ణ భేటీ.. అందుకేనా?

హీరో బాలకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. అరగంట పాటు వీరి భేటీ జరిగింది. పలు అంశాలపై చర్చించారు. బసవతారకం ఇండో- అమెరికన్క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా అందిస్తున్న సేవలను కేసీఆర్‌కు బాలకృష్ణ వివరించారు. రోగుల బంధువుల కోసం ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించాలని సీఎంను కోరారు. ఇందుకు కేసీఆర్‌ పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు సమాచారం. ఇటీవల విడుదలైన తన డిక్టేటర్ సినిమాను చూడాలని కేసీఆర్‌ను బాలయ్య కోరారు. 100వ సినిమా గురంచి కేసీఆర్ ఆరా […]

కేసీఆర్‌తో బాలకృష్ణ భేటీ.. అందుకేనా?
X

హీరో బాలకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. అరగంట పాటు వీరి భేటీ జరిగింది. పలు అంశాలపై చర్చించారు. బసవతారకం ఇండో- అమెరికన్క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా అందిస్తున్న సేవలను కేసీఆర్‌కు బాలకృష్ణ వివరించారు. రోగుల బంధువుల కోసం ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించాలని సీఎంను కోరారు. ఇందుకు కేసీఆర్‌ పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు సమాచారం. ఇటీవల విడుదలైన తన డిక్టేటర్ సినిమాను చూడాలని కేసీఆర్‌ను బాలయ్య కోరారు. 100వ సినిమా గురంచి కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆదిత్య 369కు సీక్వెల్‌గా వందో సినిమా చేస్తున్నానని బాలయ్య తెలిపారు. కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తున్నానని చెప్పారు బాలయ్య. ఈ సందర్భంగా ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ చిత్రాలను తాను బాగా చూసేవాడినని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు.

Click on Image to Read:

gali-bail-jadge2

First Published:  18 Jan 2016 1:35 AM GMT
Next Story