Telugu Global
Cinema & Entertainment

పవన్ తో రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలు

దాసరి నారాయణరావు నిర్మాణ సారధ్యంలో ఓ సినిమా చేస్తానని పవన్…. దర్శకరత్నకు మాటిచ్చాడు. దాసరి కూడా ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ అయిపోయాడు. ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా దాసరి వద్ద కథలు వినిపించారు. మరోవైపు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో… అది కంప్లీట్ అయిపోగానే దాసరి-పవన్ సినిమా పట్టాలపైకి వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ పవన్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. ఇప్పట్లో దాసరితో సినిమాను పట్టాలపైకి […]

పవన్ తో రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలు
X
దాసరి నారాయణరావు నిర్మాణ సారధ్యంలో ఓ సినిమా చేస్తానని పవన్…. దర్శకరత్నకు మాటిచ్చాడు. దాసరి కూడా ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ అయిపోయాడు. ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా దాసరి వద్ద కథలు వినిపించారు. మరోవైపు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో… అది కంప్లీట్ అయిపోగానే దాసరి-పవన్ సినిమా పట్టాలపైకి వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ పవన్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. ఇప్పట్లో దాసరితో సినిమాను పట్టాలపైకి తీసుకురాకూడదని అనుకుంటున్నాడట పవన్. కనీసం ఈ ఏడాది వరకైనా దాసరి సినిమాను ఆపాలని అనుకుంటున్నాడు. దీనికి కారణం స్టార్ దర్శకులే.
అవును…. త్రివిక్రమ్ తో పాటు రాజమౌళి కూడా పవన్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తయి, అది థియేటర్లలోకి వచ్చే సమయానికి త్రివిక్రమ్ ఫ్రీ అయిపోతాడు. ఆ వెంటనే పవర్ స్టార్ తో సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అటు రాజమౌళి కూడా బాహుబలి-2 తర్వాత పవన్ తో సినిమా చేసేందుకు సిద్ధమౌతున్నాడట. ఇలా ఒకేసారి ఇద్దరు దర్శకులు రెడీగా ఉండడంతో…. దాసరి సినిమాను కొన్నాళ్లు పక్కనపెట్టి… త్రివిక్రమ్ లేదా రాజమౌళితో సినిమా చేయాలనుకుంటున్నాడట పవన్. ఆ సినిమాను తన సొంత బ్యానర్ పైనే నిర్మించాలనుకుంటున్నాడట.
First Published:  17 Jan 2016 7:07 PM GMT
Next Story