Telugu Global
Others

తోకవున్న కరివేపాకు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ టీటీడీపీ నాయకత్వం విషయంలో పార్టీ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమవుతోంది. అభ్యర్థుల ఎంపిక, పొత్తు చర్చలు వంటి అంశాల్లో అన్ని పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి నాయకులే కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ వ్యవహారాలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్ నుంచి కేటీఆర్‌ వ్యవహారం నడిపారు. వీరంతా తెలంగాణ నాయకులే. కానీ టీటీడీపీ విషయంలో మాత్రం తంతు మరోలా సాగింది. టికెట్ల కేటాయింపులో […]

తోకవున్న కరివేపాకు
X

జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ టీటీడీపీ నాయకత్వం విషయంలో పార్టీ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమవుతోంది. అభ్యర్థుల ఎంపిక, పొత్తు చర్చలు వంటి అంశాల్లో అన్ని పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి నాయకులే కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ వ్యవహారాలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్ నుంచి కేటీఆర్‌ వ్యవహారం నడిపారు. వీరంతా తెలంగాణ నాయకులే. కానీ టీటీడీపీ విషయంలో మాత్రం తంతు మరోలా సాగింది. టికెట్ల కేటాయింపులో టీటీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌ రమణ పాత్ర దాదాపు జీరో అని చెబుతున్నారు. బీజేపీ పొత్తు చర్చల్లో రమణ పాల్గొన్నా… నిర్ణయాలు తీసుకున్నది మాత్రం ఆయన కాదు. రాబోయే కాలానికి కాబోయే సీఎం తాననేన్నట్టు చెప్పుకునే వర్కింగ్ ప్రెసెడింట్‌ రేవంత్ రెడ్డిని కూడా పక్కన పడేశారు.

ఎన్నికల ప్రచార సభల్లో భీకర గర్జనలు చేసిన రేవంత్‌ టికెట్ల కేటాయింపులో మాత్రం ఉనికి కోల్పోయారట. తన సన్నిహితుడికి రేవంత్ ఒక టికెట్ అడిగినా…. అది బీజేపీకి కేటాయించామని చెప్పి హ్యాండిచ్చారట. రమణ, రేవంత్ కాకుండా చక్రం తిప్పింది మరెవరంటే సుజనా చౌదరి. తెలంగాణ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా తంతును సుజనా చౌదరే నడిపారని చెబుతున్నారు. టికెట్లు రాని వారు హైదరాబాద్‌లోని సుజనా చౌదరి ఇంటి ముందు ఆందోళనకు దిగడానికి కూడా కారణం అదే. ఇక సుజనాకు చేదోడువాదోడుగా గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ నిలిచారు. ఇలా జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయంలో మిగిలిన పార్టీలలో రాష్ట్ర స్థాయి నాయకులు చక్రం తిప్పుతుంటే ఒక్క టీడీపీలో మాత్రమే తెలంగాణతో సంబంధం లేని వ్యక్తులు చక్రం తిప్పారు. పేరు చివర టీటీడీపీ అధ్యక్షుడు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న తోకలున్నా ఎల్‌.రమణ, రేవంత్ మాత్రం ఏం చేయలేకపోయారని చెబుతున్నారు.

First Published:  18 Jan 2016 3:48 AM GMT
Next Story