ఈ బిజినెస్‌లో లెక్కలకు విలువుందా?

చిరు 150 వ సినిమా గురించి  ఎంతో కాలం నుంచి   ఒక ముగింపు లేని చర్చ న‌డుస్తూనే ఉంది.   150 వ చిత్రంపై చిరు   గ‌ట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ సినిమాకు  ద‌ర్శ‌కుల విష‌యంలో కొంత కాలం..  క‌థ‌ల విష‌యంలో మ‌రి కొంత కాలం  త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు న‌డిచాయి.  అయితే చివ‌ర‌కు వివి  వినాయ‌కే  చిరు 150 వ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్న‌ట్లు ఆయ‌న మీడియాకు  క్లారీటి ఇచ్చారు.

గ‌తంలో అల్రేడి గాసిప్ రాయుళ్లు చెప్పిన‌ట్లు  త‌మిళ్ లో   ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్ హీరో విజ‌య్ తో చేసిన క‌త్తి చిత్రం  రీమేక్ చేస్తున్నార‌ట‌. రాంచ‌ర‌ణ్  ప్రొడ్యూస‌ర్.  అయితే ప్ర‌స్తుతం చిరు తీసుకుబోయే రెమ్యున్ రేష‌న్ ఏకంగా 30 కోట్లు తీసుకుంటున్నాడ‌నే  టాక్ స్టార్ట్ అయ్యింది. నిజంగా  అంత వుందా అనేది  ఒక  సందేహాం. మార్కెట్ ప‌రంగా ఢోకాలేన‌ప్ప‌టికి.. ప్రస్తుత పరిస్థితిలో చిరు సినిమాకు రీపిట్ ఆడియ‌న్స్  వ‌స్తారా.?  అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌ రీపిట్ ఆడియ‌న్స్ వ‌చ్చి సినిమా మూడు వారాల పాటు  హిట్ టాక్ తో న‌డిస్తే త‌ప్ప  50 కోట్ల పై చిలుకు  బ‌డ్జెట్ రావ‌డం  క‌ష్టం.  ఎలాగు 150 వ చిత్రం కాబ‌ట్టి బ‌డ్జెట్ భారీగానే వుంటుంది. రెమ్యున్ రేష‌న్ కే  30 కోట్లు ఇస్తే.. సినిమా నిర్మాణం  ఖర్చు  ఒక 50 కోట్లు వుంటే.. సినిమా బిజినెస్ ఎంత జ‌ర‌గాలి..? ఎలా జ‌ర‌గాలి?.  చిరంజీవి మీద ఇప్ప‌ట్లో  80 కోట్లు (ఆయ‌న రెమ్యున్ రేష‌న్ ను క‌లుపుకుని  వ‌ర్కువుట్ అవుతుందా..?) అనేది ప‌రిశీల‌కుల ప్ర‌శ్న‌.అయితే రామ్‌చరణ్ ఈ చిత్రానికి నిర్మాత అన్నది మరిచిపోకూడదు. పైకి 30 కోట్ల రెమ్యూనరేషన్ అని చెబుతున్నా కొడుకు దగ్గర అంత మొత్తం తీసుకుంటారా?.  అయినా డబ్బు చిరు దగ్గరుంటే ఏంటి?..  చెర్రీ దగ్గరుంటే ఏంటి?. చిరు సంపాదించింది దానికి కూడా చరణే కదా వారసుడు.