ఎన్టీఆర్‌ను కావాలనే అవమానిస్తున్నారా?

నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సినీపెద్దలు, బడా స్టార్లు ఈ సినిమా చూసి ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. అయితే ఇక్కడే చిన్న మెలిక పడింది. సినిమాను ఇష్టపడిన వాళ్లంతా సుకుమారుకు ప్రత్యక్షంగానో…. ఫోన్ చేసో  అభినందనలు చెబుతున్నారు. కానీ ఎన్టీఆర్ కు మాత్రం క్రెడిట్ దక్కడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 
సినిమా విడుదలైనప్పటి నుంచి… నాన్నకు ప్రేమతో మూవీని అంతా సుకుమార్ యాంగిల్ లోనే చూస్తున్నారు. ఎన్టీఆర్ బాగా చేశాడంటూనే… క్రెడిట్ మొత్తం సుకుమార్ కు కట్టబెడుతున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన మహేష్ బాబు, రామ్ చరణ్ కూడా సుకుమార్ కే ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దీంతో యంగ్ టైగర్ వర్గం గుర్రుగా ఉంటోంది. క్రెడిట్ తమ నాయకుడికి కాకుండా… సుకుమార్ కు పోతుంటే తారక్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణంగా రాజమౌళి సినిమాలకు సంబంధించి ఇలా జరుగుతుంది. హీరో ఎవరైనా క్రెడిట్ జక్కన్న ఖాతాలో పడుతుంది. ఈసారి సుకుమార్ విషయంలో ఇలా జరిగింది. మరి దీనిపై తారక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.