Telugu Global
Others

స్వేచ్ఛ లేకుంటే ఎలా? కొత్త చట్టం తేవాలి

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వర్శిటీలో పర్యటించారు. విద్యార్థులతో చాలాసేపు మాట్లాడారు. ఘటన ఎలా జరిగిందన్నదానిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాహుల్… యూనివర్శిటీల్లో పక్షపాత ధోరణులు సరికాదన్నారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీ వీసీ, కేంద్రమంత్రులే రోహిత్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని సృష్టించారని ఆరోపించారు. వర్శిటీల్లో భావప్రకటన స్వేచ్చ ఉండాలన్నారు. విద్యార్థులకు హక్కుల కల్పించేలా చట్టం తీసుకురావాలన్నారు. వీసీకి సభ్యతా సంస్కారం లేదని… […]

స్వేచ్ఛ లేకుంటే ఎలా? కొత్త చట్టం తేవాలి
X

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వర్శిటీలో పర్యటించారు. విద్యార్థులతో చాలాసేపు మాట్లాడారు. ఘటన ఎలా జరిగిందన్నదానిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాహుల్… యూనివర్శిటీల్లో పక్షపాత ధోరణులు సరికాదన్నారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీ వీసీ, కేంద్రమంత్రులే రోహిత్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని సృష్టించారని ఆరోపించారు. వర్శిటీల్లో భావప్రకటన స్వేచ్చ ఉండాలన్నారు. విద్యార్థులకు హక్కుల కల్పించేలా చట్టం తీసుకురావాలన్నారు.

వీసీకి సభ్యతా సంస్కారం లేదని… విద్యార్థి చనిపోతే కనీసం ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. దళిత విద్యార్థులను వీసీ అణగదొక్కారని మండిపడ్డారు. అంతకు ముందు రాహుల్ గాంధీ రోహిత్ తల్లిని పరామర్శించారు. రోహిత్ కుటుంబానికి పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. దీక్ష చేస్తున్న జేఏసీ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

First Published:  19 Jan 2016 4:20 AM GMT
Next Story