Telugu Global
Others

ఇస్రో విజయ పరంపర

ఇస్రో దూసుకుపోతోంది. భారత అంతరిక్ష రంగానికి సాటిలేదని నిరూపిస్తోంది. కొత్త ఏడాదిలో తొలి ప్రయోగమైన పీఎస్ఎల్వీ -సీ 31 కూడా విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో షార్ నుంచి ఉదయం 9.31 నిమిషాలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ31 ను  ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. 19 డిగ్రీల భూబదిలీ కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించడం ద్వారా దశలవారీగా 284 […]

ఇస్రో విజయ పరంపర
X
ఇస్రో దూసుకుపోతోంది. భారత అంతరిక్ష రంగానికి సాటిలేదని నిరూపిస్తోంది. కొత్త ఏడాదిలో తొలి ప్రయోగమైన పీఎస్ఎల్వీ -సీ 31 కూడా విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో షార్ నుంచి ఉదయం 9.31 నిమిషాలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ31 ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. 19 డిగ్రీల భూబదిలీ కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించడం ద్వారా దశలవారీగా 284 కిలోమీటర్ల పెరిజీని పెంచుకుంటూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిరకక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ప్రయోగాన్ని నాలుగు దశల్లో విజయవంతంగా పూర్తి చేసినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
2016 సంవత్సరంలో ఇస్రో సాధించిన తొలి ఘన విజయమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. రెండున్నర నెలల్లో మిగతా రెండు ఉపగ్రహాలను ప్రయోగిస్తామని, 2016 చివరి నాటికి దిక్సూచీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఇది. ఇప్పటి వరకు పీఎస్ఎల్వీ సిరీస్‌లో 33 ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగం వల్ల వాతావరణం, భూగర్భ పరిశోధనలు, గ్రహాల స్ధితిగతులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉపగ్రహంతో గ్లోబల్‌ పొజిషినింగ్‌ సిస్టమ్‌ మరింత సులువుగా అందుబాటులోకి రానుంది.
First Published:  20 Jan 2016 12:34 AM GMT
Next Story