Telugu Global
Cinema & Entertainment

సీన్ నుంచి సైలెంట్ గా తప్పుకుంటున్నాడు

బాలీవుడ్ లో కత్రినాకైఫ్-రణబీర్ కపూర్ ప్రేమించుకుంటున్నానే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట… త్వరలోనే ఒకటౌతుందని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ…. తమ ఆరేళ్ల ప్రేమబంధాన్ని తెంచేసుకోవడానికి సిద్ధమౌతున్నారు రణబీర్-కత్రిన. తాజా సమాచారం ప్రకారం…. వీళ్లిద్దరూ దాదాపు విడిపోయినట్టే. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఈ ఎపిసోడ్ లోకి సల్మాన్ కూడా ఎంటర్ అయ్యాడు. రణబీర్-కత్రినా విడిపోయే క్రమంలో…. కత్రినాకైఫ్ ఓ మూడు సార్లు సల్మాన్ ఖాన్ […]

సీన్ నుంచి సైలెంట్ గా తప్పుకుంటున్నాడు
X
బాలీవుడ్ లో కత్రినాకైఫ్-రణబీర్ కపూర్ ప్రేమించుకుంటున్నానే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట… త్వరలోనే ఒకటౌతుందని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ…. తమ ఆరేళ్ల ప్రేమబంధాన్ని తెంచేసుకోవడానికి సిద్ధమౌతున్నారు రణబీర్-కత్రిన. తాజా సమాచారం ప్రకారం…. వీళ్లిద్దరూ దాదాపు విడిపోయినట్టే. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఈ ఎపిసోడ్ లోకి సల్మాన్ కూడా ఎంటర్ అయ్యాడు. రణబీర్-కత్రినా విడిపోయే క్రమంలో…. కత్రినాకైఫ్ ఓ మూడు సార్లు సల్మాన్ ఖాన్ ను కలుసుకుంది. దీంతో ఈ ప్రేమజంట విడిపోవడానికి సల్మానే కారణమంటూ పుకార్లు చెలరేగాయి. అంతేకాదు…. తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కత్రినాకు సల్మాన్ దగ్గరవుతున్నాడనే వార్తలు కూడావచ్చాయి. దీంతో కండలవీరుడు జాగ్రత్తపడ్డాడు. ఈ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం నంబర్ వన్ హోదా అనుభవిస్తున్న సల్మాన్… ఓ వైపు కోర్టు కేసులతో సతమతమౌతున్నాడు. ఇలాంటి టైమ్ లో…. ఈ వ్యక్తిగత వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.
First Published:  19 Jan 2016 7:03 PM GMT
Next Story