Telugu Global
Cinema & Entertainment

ఆరోజే స‌రైందంటున్న బ‌న్నీ..!

టాలీవుడ్ అంతా తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి కానుకలు ఇచ్చేసి పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తే ఊరించి మరీ ఊరకుండిపోయాడు అల్లు అర్జున్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 50% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ సినిమా గురించి ఏ విషయమూ బయటకు పొక్కనీయటం లేదు. టైటిల్ కూడా ‘సరైనోడు’ అని వినిపిస్తున్నా గట్టిగా చెప్పలేని పరిస్థితి. మరోవైపు సంక్రాంతి గిఫ్ట్ మిస్ చేసినందుకు అభిమానులు కూడా బుంగమూతి […]

ఆరోజే స‌రైందంటున్న బ‌న్నీ..!
X

టాలీవుడ్ అంతా తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి కానుకలు ఇచ్చేసి పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తే ఊరించి మరీ ఊరకుండిపోయాడు అల్లు అర్జున్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 50% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ సినిమా గురించి ఏ విషయమూ బయటకు పొక్కనీయటం లేదు. టైటిల్ కూడా ‘సరైనోడు’ అని వినిపిస్తున్నా గట్టిగా చెప్పలేని పరిస్థితి. మరోవైపు సంక్రాంతి గిఫ్ట్ మిస్ చేసినందుకు అభిమానులు కూడా బుంగమూతి పెట్టారట. ఇప్పడు వారిని బుజ్జగించే పనుల్లోనే ఉన్నాడట ఈ అల్లువారి పిల్లగాడు. రకుల్ ప్రీత్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల కానుందట. అంతా బానే ఉంది కానీ… గణతంత్ర దినోత్సవాన్ని టార్గెట్ చేశారంటే ఇందులో బోయపాటి ఏదైనా సామాజికాంశం జోడించారంటారా..?

First Published:  19 Jan 2016 7:08 PM GMT
Next Story