Telugu Global
Cinema & Entertainment

బాహుబలి షూటింగ్ ఆగిపోయింది

ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ కేరళలో కొనసాగుతోంది. ఈనెల 19న ప్రారంభమైన షూటింగ్… కేరళలోని ప్రసిద్ధ కన్నూరు కోటలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే రెండు రోజులు షూటింగ్ అయిన తర్వాత స్థానికంగా ఉండే గిరిజనులు, నేతలు ఈ షూటింగ్ ను అడ్డుకున్నారు. చారిత్రక నేపథ్యం కలిగి, శిధిలావస్థలో ఉన్న కన్నూరు కోటలో షూటింగ్ చేయకూడదంటూ నిరసన తెలిపారు. షూటింగ్ కు అనుమతినిచ్చిన కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నిరనసు చేస్తున్న ఆందోళనకారులు… బాహుబలి-2 టీం ను అక్కడ నుంచి […]

బాహుబలి షూటింగ్ ఆగిపోయింది
X
ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ కేరళలో కొనసాగుతోంది. ఈనెల 19న ప్రారంభమైన షూటింగ్… కేరళలోని ప్రసిద్ధ కన్నూరు కోటలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే రెండు రోజులు షూటింగ్ అయిన తర్వాత స్థానికంగా ఉండే గిరిజనులు, నేతలు ఈ షూటింగ్ ను అడ్డుకున్నారు. చారిత్రక నేపథ్యం కలిగి, శిధిలావస్థలో ఉన్న కన్నూరు కోటలో షూటింగ్ చేయకూడదంటూ నిరసన తెలిపారు. షూటింగ్ కు అనుమతినిచ్చిన కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నిరనసు చేస్తున్న ఆందోళనకారులు… బాహుబలి-2 టీం ను అక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందిగా డిమాండ్ చేశారు. మరోవైపు దర్శకుడు రాజమౌళితో పాటు మిగతా సభ్యులంతా కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ…. నిరసనకారులు శాంతించలేదు. ఫలితంగా నిన్న జరగాల్సిన షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో జక్కన్న ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. పోలీస్ భద్రత నడుమ షూటింగ్ జరపాలా…. లేక మరో లొకేషన్ కు షిఫ్ట్ అవ్వాలా అనే ఆలోచనలో ఉన్నాడు.
First Published:  20 Jan 2016 7:04 PM GMT
Next Story