Telugu Global
Cinema & Entertainment

ఇంటర్నెట్ లో సర్దార్ బ్రహ్మి సంచలనం

సర్దార్ గబ్బర్ సింగ్ కు సంబంధించిన ఏ న్యూస్ అయినా ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. మరి అదే పేరుతో ఓ పేరడీ కూడా ప్రారంభమైతే అది మరింతగా ఎట్రాక్ట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఆ పేరడీలో ఉంటే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఓవైపు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కొనసాగుతున్న సమయంలోనే…. మరోవైపు ఆ సినిమాకు […]

ఇంటర్నెట్ లో సర్దార్ బ్రహ్మి సంచలనం
X
సర్దార్ గబ్బర్ సింగ్ కు సంబంధించిన ఏ న్యూస్ అయినా ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. మరి అదే పేరుతో ఓ పేరడీ కూడా ప్రారంభమైతే అది మరింతగా ఎట్రాక్ట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఆ పేరడీలో ఉంటే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఓవైపు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కొనసాగుతున్న సమయంలోనే…. మరోవైపు ఆ సినిమాకు పేరడీ సిద్ధమైంది. అచ్చం సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ గెటప్ ను అనుకరిస్తూ… బ్రహ్మి కూడా గెటప్ వేశాడు. గుర్రం కూడా సెట్ చేసుకున్నాడు. స్టార్ కమెడియన్ బ్రహ్మి ఇలా పవన్ గెటప్ లోకి మారేసరికి అంతా అవాక్కయ్యారు. అయితే నెట్ లో హల్ చల్ చేస్తున్న ఈ ఫొటో ఏ సినిమాలోనిది అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ గా ఉంచుతున్నారు. పవన్ సినిమాలోనే బ్రహ్మి ఇలా ఈ గెటప్ వేశాడని కొందరు అంటుంటే…. ఓ చిన్న సినిమాలో ఈ పేరడీని పండిస్తున్నారని మరికొందరు అంటున్నారు.
First Published:  20 Jan 2016 7:02 PM GMT
Next Story