Telugu Global
Cinema & Entertainment

ప్రియాంక చోప్రాకి గోల్డెన్ చాన్స్..!

హాలీవుడ్ టీవీ సీరీస్ ‘క్వాంటికో’తో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ఈ సిరీస్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులను సొంతం చేసుకుంది. ఇదే జోష్ లో సొంత గడ్డ మీద కూడా సత్తా చాటడానికి రెడీ అవుతోంది. ‘క్వాంటికో’ స్పూర్తితో ఇండియాలో కూడా ఓ సీరియల్ ను నిర్మించాలని భావిస్తోంది ప్రియాంక చోప్రా. ఇటీవల పర్పల్ పెబల్ పిక్చర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన […]

ప్రియాంక చోప్రాకి గోల్డెన్ చాన్స్..!
X

హాలీవుడ్ టీవీ సీరీస్ ‘క్వాంటికో’తో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ఈ సిరీస్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులను సొంతం చేసుకుంది. ఇదే జోష్ లో సొంత గడ్డ మీద కూడా సత్తా చాటడానికి రెడీ అవుతోంది. ‘క్వాంటికో’ స్పూర్తితో ఇండియాలో కూడా ఓ సీరియల్ ను నిర్మించాలని భావిస్తోంది ప్రియాంక చోప్రా.

ఇటీవల పర్పల్ పెబల్ పిక్చర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన ప్రియాంక చోప్రా, ఆ బ్యానర్ లో మూడు ప్రాంతీయ చిత్రాలు ప్రారంభించింది. బోజ్ పురిలో భమ్ భమ్ బోల్ రహామై, మరాఠిలో వెంటిలేటర్, పంజాబీలో ఓంకార్ సినిమాలను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది. ఈ సినిమాలతో పాటు ‘ఇట్స్ మై సిటీ’ పేరుతో ఓ సీరియల్ ను కూడా ప్రారంభిస్తోంది.

అయితే ఈ సీరియల్ ను ఏ టీవీ ఛానల్ లో ప్రసారం చేయకుండా నేరుగా ప్రేక్షకులు డిజిటల్ టెక్నాలజీ సాయంతో మొబైల్ ఫోన్ లో చూసుకునే వీలు కల్పించడానికి ప్రయత్నిస్తోంది. నెక్స్ జీటీవీ(nexGTV) మొబైల్ యాప్ ద్వారా సీరియల్ ను నేరుగా మొబైల్ ఫోన్ లో చూసే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ముంబైలో ఒకే ఫ్లాట్ లో నివసించే నలుగురు అమ్మాయిల కథతో రూపొందుతున్న ఈ సీరియల్ లో, ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటించనుంది.

First Published:  20 Jan 2016 7:08 PM GMT
Next Story