నాగార్జునా… నమో వెంకటేశ!

సోగ్గాడే చిన్ని నాయనా హిట్ తర్వాత నాగార్జున నెక్ట్స్ సినిమా ఏంటనే చర్చ ఊపందుకుంది. సోగ్గాడే దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే నాగ్ మరో సినిమా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ నాగార్జున మాత్రం మరోసారిన తన విలక్షణత చాటుకున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ భక్తిరస చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు నమో వెంకటేశ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. గతంలో నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ లో అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి లాంటి చిత్రాలొచ్చాయి. అదే కోవలో ఇప్పుడు నమో వెంకటేశ అనే సినిమా కూడా రాబోతోంది. మొత్తంగా చూసుకుంటే… నాగ్-రాఘవేంద్రరావు కాంబోలో వస్తున్న పదో సినిమా ఇది. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు సమకూర్చనున్నాడు. నమో వెంకటేశ ప్రాజెక్టుకు సంబంధించి దర్శకేంద్రుడు ఇప్పటికే స్క్రీన్ ప్లే పూర్తిచేసినట్టు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న ఊపిరి సినిమా కంప్లీట్ అయిన వెంటనే…. ఈ భక్తిరస చిత్రం సెట్స్ పైకి వస్తుంది.