Telugu Global
Others

చంద్రన్న కానుకలు చెత్తలోకేనా?

పేదోడు పండుగ చేసుకోవాలంటూ ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న కానుకలకు విలువ లేకుండాపోయింది. చాలామంది వాటిని తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. కందిపప్పు, బెల్లం, నెయ్యి వంటి వస్తువులతో ఫ్రీగా ఇస్తామన్నా చాలా మంది తీసుకోలేదట. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 47 కోట్ల రూపాయల విలువైన సంక్రాంతి కానుకలు మిగిలిపోయాయి. ఉచితంగా ఇచ్చినా తీసుకోవకపోవడంతో వాటిని ఎలా వదిలించుకోవాలా అని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. సంక్రాంతి కానుక కోసం మొత్తం 314 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. […]

చంద్రన్న కానుకలు చెత్తలోకేనా?
X

పేదోడు పండుగ చేసుకోవాలంటూ ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న కానుకలకు విలువ లేకుండాపోయింది. చాలామంది వాటిని తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. కందిపప్పు, బెల్లం, నెయ్యి వంటి వస్తువులతో ఫ్రీగా ఇస్తామన్నా చాలా మంది తీసుకోలేదట. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 47 కోట్ల రూపాయల విలువైన సంక్రాంతి కానుకలు మిగిలిపోయాయి. ఉచితంగా ఇచ్చినా తీసుకోవకపోవడంతో వాటిని ఎలా వదిలించుకోవాలా అని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.

సంక్రాంతి కానుక కోసం మొత్తం 314 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. హోల్‌సేల్‌లోనూ అధిక ధరకు వస్తువులు కొన్నారు. ఇంత చేసినా చంద్రన్న కానుక అనుకున్న ఫలితం ఇవ్వలేదని చెబుతున్నారు. చంద్రన్న కానుకలోని వస్తువుల నాణ్యత లేకపోవడం, బెల్లం తుకాల్లో తేడా ఉండడంతో మంచి కన్నా వ్యతిరేకంగానే ఎక్కువగా ప్రచారం సాగింది. దీంతో చాలా మంది మధ్యతరగతి జనం చంద్రన్న కానుకను తీసుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అయ్యారు. దీంతో అనుకున్న స్థాయిలో ఉచిత పంపిణీ జరగలేదని అధికారులు చెబుతున్నారు. మరి ఈ 47 కోట్ల విలువైన కానుకలను ఏం చేస్తారో చూడాలి.

First Published:  22 Jan 2016 12:28 AM GMT
Next Story