Telugu Global
Others

బరితెగించిన బ్రిటన్‌

ఓ గూఢచారి హత్య కేసులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ పై బ్రిటన్‌ ఆరోపణలు చేస్తోంది. రష్యా సెక్యూరిటీ సర్వీసెస్ లో 2000 వ సంవత్సరం వరకు అలెగ్జాండర్ లెట్వినెంకో  స్పై ఆఫీసర్ గా పనిచేశారు. ఆయన ఆతరువాత బ్రిటన్ కు వెళ్లిపోయారు. బ్రిటన్ గూఢచార విభాగంలో చేరడమే కాకుండా అక్కడి పౌరసత్వం కూడా తీసుకున్నాడు. రష్యాలో  స్పై అఫీసర్ గా అనుభవం ఉన్న లెట్వినెంకోను బ్రిటన్ రష్యాకు వ్యతిరేకంగా అదే హోదాలో తమదేశ గూఢాచార విభాగంలో […]

బరితెగించిన బ్రిటన్‌
X
ఓ గూఢచారి హత్య కేసులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ పై బ్రిటన్‌ ఆరోపణలు చేస్తోంది. రష్యా సెక్యూరిటీ సర్వీసెస్ లో 2000 వ సంవత్సరం వరకు అలెగ్జాండర్ లెట్వినెంకో స్పై ఆఫీసర్ గా పనిచేశారు. ఆయన ఆతరువాత బ్రిటన్ కు వెళ్లిపోయారు. బ్రిటన్ గూఢచార విభాగంలో చేరడమే కాకుండా అక్కడి పౌరసత్వం కూడా తీసుకున్నాడు. రష్యాలో స్పై అఫీసర్ గా అనుభవం ఉన్న లెట్వినెంకోను బ్రిటన్ రష్యాకు వ్యతిరేకంగా అదే హోదాలో తమదేశ గూఢాచార విభాగంలో నియమించింది. స్పెయిన్- రష్యాలోని మాఫియాపై ఆయన విస్తృత పరిశోధనలు చేశాడు. ఇందులో భాగంగా లెట్వినెంకో స్పెయిన్‌ వెళ్తున్న ప్రయత్నంలోనే లండన్‌లోని ఓ హోటల్‌లో ఉండగా విష ప్రయోగం జరిగింది. అతను తాగిన టీలో పొలోనియం-210 అనే రేడియోధార్మిక పదార్థం కలపటంతో తీవ్ర అనారోగ్యానికి గురై.. కొంతకాలం తర్వాత చనిపోయాడు.
అయితే అలెగ్జాండర్ లెట్వినెంకో మృతి రష్యా, బిట్రన్ దేశాల మధ్య వివాదంగా మారింది. అతని హత్య వెనుక రష్యా కుట్ర ఉందంటూ బ్రిటన్‌ ప్రభుత్వం ఆరోపించింది. తమ గూఢాచారిని డబుల్‌ ఏజెంట్‌గా నియమించి బ్రిటన్‌ రష్యాకు వ్యతిరేకంగా అతను పనిచేసేలా పురికొల్పి దౌత్యనీతికి ద్రోహం చేసిందని రష్యా ఆరోపించింది. అయితే లెట్వినెంకో మృతిపై బ్రిటన్ విచారణ కమిటీని నియమించింది. తాజాగా ఆ కమిటీ విచారణలో రష్యా ప్రభుత్వ ఆదేశాలతోనే లెట్వినెంకోపై విష ప్రయోగం జరిగిందని.. ఇందులో అధ్యక్షుడు పుతిన్ ప్రమేయం ఉందని బ్రిటన్ నియమించిన కమిటీ నిర్ధారించింది. వెంటనే రంగంలోకి దిగిన బ్రిటన్ ప్రభుత్వం పుతిన్ కి ఇబ్బందులు కలిగించే చర్యలు ప్రారంభించింది. యూకేలోని రష్యా రాయబార కార్యాలయ అధికారికి నోటీసులు జారీ చేసింది. పుతిన్‌పై ఇంటర్‌పోల్‌ నోటీస్‌లు జారీ చేయించి పుతిన్ పై అరెస్ట్ వారెంట్‌ జారీ అయ్యేలా చర్యలు తీసుకుంది.
ఈ పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ యూరోపియన్‌ దేశాల మీదుగా ప్రయాణిస్తే అరెస్ట్ చేయడం ఖాయమని బ్రిటన్‌ సంబరపడుతోంది. అంతేకాదు ఆయన యూరోపియన్ యూనియన్‌దేశాల విమానాల్లో ప్రయాణంపైనా నిషేధం అమల్లోకి వచ్చింది. మరోవైపు బ్రిటన్ చర్యలపై రష్యా ప్రభుత్వం భగ్గుమంటోంది. లెట్వినెంకో హత్యకు పుతిన్‌ కు సంబంధం ఉందన్న ఆరోపణలను రష్యా దేశ విదేశాంగ శాఖ ఖండించింది. రష్యా గూఢాచారిని రష్యాకు వ్యతిరేకంగా పనిచేయించి బ్రిటన్‌ తప్పుచేసిందని మండిపడింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించే బ్రిటన్‌ ఈ వ్యవహారంలో ప్రపంచం అసహ్యంచుకొనే చర్యలకు దిగింది. ఇరాక్‌ వ్యవహారంలో టోనిబ్లేయర్‌ అరెస్టుకు ఇతర దేశాలు రంగంలోకి దిగితే బ్రిటన్‌ వూరుకుంటుందా? అరబ్‌ ప్రపంచంలో అనవసరంగా జోక్యం చేసుకొని ప్రపంచాన్ని రావణకాష్టంగా చేసిన బుష్‌, బ్లేయర్‌లను పట్టుకొచ్చి ఉరితీస్తామంటే బ్రిటన్‌ అంగీకరిస్తుందా? అని రష్యన్‌లు ప్రశ్నిస్తున్నారు.
First Published:  21 Jan 2016 10:08 PM GMT
Next Story