Telugu Global
Cinema & Entertainment

దిల్ రాజు బ్యాన‌ర్ లో  సొగ్గాడు..!

సంక్రాంతి బరిలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కింగ్ నాగార్జున. వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఈ సక్సెస్ తరువాత కొంత గ్యాప్ తీసుకోవాలని భావించిన వరుస ఆఫర్లు వస్తుండటంతో గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేయడానికే రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓ చారిత్రక చిత్రానికి రెడీ అవుతున్న నాగ్ మరో కమర్షియల్ ఎంటర్ టైనర్ మీద కూడా దృష్టి పెట్టాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు […]

దిల్ రాజు బ్యాన‌ర్ లో  సొగ్గాడు..!
X
సంక్రాంతి బరిలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కింగ్ నాగార్జున. వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఈ సక్సెస్ తరువాత కొంత గ్యాప్ తీసుకోవాలని భావించిన వరుస ఆఫర్లు వస్తుండటంతో గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేయడానికే రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓ చారిత్రక చిత్రానికి రెడీ అవుతున్న నాగ్ మరో కమర్షియల్ ఎంటర్ టైనర్ మీద కూడా దృష్టి పెట్టాడు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రవితేజ హీరోగా ఓ సినిమాను ప్రారంభిచాడు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వేణు శ్రీరాం ఈ సినిమాకు దర్శకుడు. లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా, తరువాత కథ విషయంలో దిల్ రాజు, రవితేజలకు అభిప్రాయ బేధం రావటంతో ఆగిపోయింది. దీంతో ఇప్పుడు అదే సినిమాను కొద్ది పాటి మార్పులతో నాగార్జున హీరోగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు. మరి రవితేజ కాదన్న కథను నాగ్ అంగీకరిస్తాడో లేదో చూడాలి.
First Published:  21 Jan 2016 7:08 PM GMT
Next Story