Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మానందం బతికిపోయాడా..?

వరుస ఫ్లాపులు…. ఎన్నో విమర్శలు…. తప్పిపోతున్న ఆఫర్లు…. తగ్గిపోతున్న పారితోషికం… ఇలా కెరీర్ గ్రాఫ్ సెన్సెక్స్ లా కుప్పకూలుతున్న వేళ…. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో ఓ మంచి విజయం అందుకున్నాడు బ్రహ్మానందం. మరి ఈ సక్సెస్ బ్రహ్మానందం కెరీర్ కు కలిసొస్తుందా.. బ్రహ్మి మరోసారి చక్రం తిప్పుతాడా… తన పారిషోషికాన్ని పెంచుతాడా… ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో ఆత్మానంద స్వామిగా నటించాడు బ్రహ్మి. ఈ పాత్ర బ్రహ్మి కెరీర్ లో […]

బ్రహ్మానందం బతికిపోయాడా..?
X
వరుస ఫ్లాపులు…. ఎన్నో విమర్శలు…. తప్పిపోతున్న ఆఫర్లు…. తగ్గిపోతున్న పారితోషికం… ఇలా కెరీర్ గ్రాఫ్ సెన్సెక్స్ లా కుప్పకూలుతున్న వేళ…. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో ఓ మంచి విజయం అందుకున్నాడు బ్రహ్మానందం. మరి ఈ సక్సెస్ బ్రహ్మానందం కెరీర్ కు కలిసొస్తుందా.. బ్రహ్మి మరోసారి చక్రం తిప్పుతాడా… తన పారిషోషికాన్ని పెంచుతాడా… ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.
సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో ఆత్మానంద స్వామిగా నటించాడు బ్రహ్మి. ఈ పాత్ర బ్రహ్మి కెరీర్ లో ది బెస్ట్ కాకపోయినప్పటికీ… ప్రస్తుత పరిస్థితుల్లో అతడి కెరీర్ కు బాగా హెల్ప్ అయింది. ఆ పాత్రలో బ్రహ్మి పంచిన నవ్వులు… చిరు పాటకు వేసిన స్టెప్పులు అందర్నీ ఎట్రాక్ట్ చేశాయి. సినిమా సక్సెస్ మాట అటుంచింతే… బ్రహ్మి కెరీర్ కు సోగ్గాడే మూవీ బాగా కలిసొస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. మరి సోగ్గాడే విజయం బ్రహ్మికి ఎంతమేరకు కలిసొస్తుందో చూడాలి. గతేడాది బ్రహ్మి చేసిన బ్రూస్ లీ, కిక్-2, బెంగాల్ టైగర్, సైజ్ జీరో, శివమ్, లోఫర్, అఖిల్, సౌఖ్యం, షేర్ సినిమాలేవీ అతడికి కలిసిరాలేదు. ఇన్నాళ్లకు కలిసొచ్చిన సోగ్గాడే సినిమాను ఈ స్టార్ కమెడియన్ ఏ మేరకు క్యాష్ చేసుకుంటాడో చూడాలి.
First Published:  21 Jan 2016 7:02 PM GMT
Next Story